Title (Indic)సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా తతితోడ నారగించీ తగునె యీ దేవుఁడు (॥సతితో॥) ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి మిక్కిలినలసె నలమేలుమంగ చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు (॥సతితో॥) పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి మీఱి బుసకొట్టె నలమేలుమంగ జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు (॥సతితో॥) వాలిన రాజసముతో వంటసాలలోననే మేలిమిఁ గూచున్న దలమేలుమంగ యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు English(||pallavi||) sadidoḍa sārĕsārĕgu sarasamulāḍugŏṁṭā tadidoḍa nāragiṁchī tagunĕ yī devum̐ḍu (||sadido||) ŏkkamāḍĕ vaṁṭalĕllā nŏddanuṁḍi vaḍḍiṁchi mikkilinalasĕ nalamelumaṁga sĕkkulam̐ jĕmaḍagāram̐ jeri yībĕ vaḍḍiṁcham̐gā sŏkki sŏkki yāragiṁchīm̐ jūḍarĕ yīdevum̐ḍu (||sadido||) pāṟi pāṟi baṁgārubaḽḽĕmulu vĕṭṭiṁchi mīṟi busagŏṭṭĕ nalamelumaṁga jāṟina turumudoḍam̐ javulāgĕ yaḍugam̐ga āṟaḍi gūralu mĕchchīnaṁtalo nīdevum̐ḍu (||sadido||) vālina rājasamudo vaṁṭasālalonane melimim̐ gūsunna dalamelumaṁga yīlonĕ śhrīveṁkaḍeśhum̐ḍībĕm̐ dānunāragiṁchi tālamim̐ gām̐giḍam̐gūḍĕ dakkaga yīdevuṁḍu