Title (Indic)సాము సేసినవాఁడవు జగజెట్టివి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాము సేసినవాఁడవు జగజెట్టివి నీవు యీ మగువ నీతోను యింతేసి కోపునా (॥సాము॥) చెక్కులేల నొక్కేవు సిగ్గువడీఁ జెలియ మెుక్కలానఁ జూడఁగాను మోము వంచీని కక్కసించి కిఁక నీవు కడలేనిజవ్వనిఁ నిక్కవ లంటి పెనఁగే వింత కోపునా (॥సాము॥) చేయి పైనేల వేసేవు చెమరించీఁ గలికి ఆయము లంటకు వెరగందీ నిట్టె కాయము చిమ్మిరేఁచకు కడుఁగడుముద్దరాలు యీయెడ నెంతేసి నవ్వేవింత కోవునా (॥సాము॥) అందేల ముట్టేవు మొక్కీ నలమేలుమంగ సందడిఁ గొంగువట్టకు సన్న సేసీని యిందుముఖిఁ గూడితివి యింతలో శ్రీవేంకటేశ యిందరిలో మేలమాడే వింత కోపునా English(||pallavi||) sāmu sesinavām̐ḍavu jagajĕṭṭivi nīvu yī maguva nīdonu yiṁtesi kobunā (||sāmu||) sĕkkulela nŏkkevu sigguvaḍīm̐ jĕliya mĕుkkalānam̐ jūḍam̐gānu momu vaṁchīni kakkasiṁchi kim̐ka nīvu kaḍalenijavvanim̐ nikkava laṁṭi pĕnam̐ge viṁta kobunā (||sāmu||) seyi painela vesevu sĕmariṁchīm̐ galigi āyamu laṁṭagu vĕragaṁdī niṭṭĕ kāyamu simmirem̐sagu kaḍum̐gaḍumuddarālu yīyĕḍa nĕṁtesi navveviṁta kovunā (||sāmu||) aṁdela muṭṭevu mŏkkī nalamelumaṁga saṁdaḍim̐ gŏṁguvaṭṭagu sanna sesīni yiṁdumukhim̐ gūḍidivi yiṁtalo śhrīveṁkaḍeśha yiṁdarilo melamāḍe viṁta kobunā