Title (Indic)సాము సేతువుగా నీవు సరుస రాముఁడవై WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాము సేతువుగా నీవు సరుస రాముఁడవై యీ మగువ నేరుపులు యివి చూడరాదా (॥సాము॥) బొమ్మల విండ్లచేత పూఁచి చూపుల యమ్ముల కుమ్మరించి చెలి నీపై గురులేసీని సమ్మతించి యిరువంక చన్నుల కాంతులు సారెఁ జిమ్ము పయ్యదలోఁ బుట్ట చెండ్లాడీని (॥సాము॥) గక్కన బిసకాండపు కరముల సన్నలను అక్కజపు నీతోఁ గోలాటమాడీని చెక్కుచెమట గోరులఁ జిందకుండా మీఁటుచు చక్కు బుఱ్ఱటకొమ్ములు సాధించీని (॥సాము॥) చిగురుమోవిమాటల చేకత్తుల పంతాలఁ దగిలి నీపైనాపె దండ వెట్టీని నగుతా శ్రీవెంకటేశ నంటున నీవు గూడితి అగపడి నీగరిడినన్నిటా మించీని English(||pallavi||) sāmu seduvugā nīvu sarusa rāmum̐ḍavai yī maguva nerubulu yivi sūḍarādā (||sāmu||) bŏmmala viṁḍlaseda pūm̐si sūbula yammula kummariṁchi sĕli nībai gurulesīni sammadiṁchi yiruvaṁka sannula kāṁtulu sārĕm̐ jimmu payyadalom̐ buṭṭa sĕṁḍlāḍīni (||sāmu||) gakkana bisagāṁḍabu karamula sannalanu akkajabu nīdom̐ golāḍamāḍīni sĕkkusĕmaḍa gorulam̐ jiṁdaguṁḍā mīm̐ṭusu sakku buṭraḍagŏmmulu sādhiṁchīni (||sāmu||) sigurumovimāḍala segattula paṁtālam̐ dagili nībainābĕ daṁḍa vĕṭṭīni nagudā śhrīvĕṁkaḍeśha naṁṭuna nīvu gūḍidi agabaḍi nīgariḍinanniḍā miṁchīni