Title (Indic)చాఁచిన చలముల సటకాఁడ యిట్టె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాఁచిన చలముల సటకాఁడ యిట్టె వేఁచితివిపుడు నీవే కావోరి (॥చాఁచిన॥) విరులు గోయఁగ నన్ను వేడుకతోఁ జూచి విరులెంత ప్రియమొ యీ వెలఁదికని మరుని తియ్యని వింటి మాయపుఁ గ్రొవ్వాఁడి విరులేయించితివి నీవేకావోరి (॥చాఁచిన॥) జలము గేళాకూళిఁ జల్లులాడఁగఁ జూచి జలమెంత ప్రియమొ యీ సతికినని చెలఁగి కాఁక చెమట చెలమ నాపై సేఁడు వెలయఁ జేసితివి నీవే కావోరి (॥చాఁచిన॥) తొడవులిడుచు నేను తొంగలించఁగఁ జూచి తొడవులే ప్రియము యీ తొయ్యలికని కడుఁదొడవులే వేంకటరాయ కొనగోర విడువకిచ్చితివి నీవే కావోరి English(||pallavi||) sām̐sina salamula saḍagām̐ḍa yiṭṭĕ vem̐sidivibuḍu nīve kāvori (||sām̐sina||) virulu goyam̐ga nannu veḍugadom̐ jūsi virulĕṁta priyamŏ yī vĕlam̐digani maruni tiyyani viṁṭi māyabum̐ grŏvvām̐ḍi viruleyiṁchidivi nīvegāvori (||sām̐sina||) jalamu geḽāgūḽim̐ jallulāḍam̐gam̐ jūsi jalamĕṁta priyamŏ yī sadiginani sĕlam̐gi kām̐ka sĕmaḍa sĕlama nābai sem̐ḍu vĕlayam̐ jesidivi nīve kāvori (||sām̐sina||) tŏḍavuliḍusu nenu tŏṁgaliṁcham̐gam̐ jūsi tŏḍavule priyamu yī tŏyyaligani kaḍum̐dŏḍavule veṁkaḍarāya kŏnagora viḍuvagichchidivi nīve kāvori