Title (Indic)చాలురా నీ పొందులు సటలకు వచ్చెనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలురా నీ పొందులు సటలకు వచ్చెనా జాలువారేఁ గన్నీళ్లు చక్క నీవుఁ జూడరా (॥చాలురా॥) నేను నీవుఁ గూచుండఁగా నిక్కి చూచి జగడించి నీ నెలఁత యేమన్నా నీవంట గాదా కానికాని వొట్లతో కదిసితి మిద్దరము మోనాన నూరకుండితే మొత్తు మంట గాదా (॥చాలురా॥) హితవై సరసము నే నిటు నీతో నాడఁగా సతి జంకించినది నీ సలిగ గాదా పతిగా సాకిరిమాట పలుకు మంటే నవ్వేవు మతకానఁ బగ దీర్చేమాయ నీది గాదా (॥చాలురా॥) యెకసక్కేనకు నాపై యీటి చూపు చూడఁగాను మొకమోటాన నుంటే నీ ముద్దులే కాదా వెకలివై యిద్దరి శ్రీవేంకటేశ కూడఁబట్టి వొకటఁ గౌఁగిలించితి వొడఁబాటు గాదా English(||pallavi||) sālurā nī pŏṁdulu saḍalagu vachchĕnā jāluvārem̐ gannīḽlu sakka nīvum̐ jūḍarā (||sālurā||) nenu nīvum̐ gūsuṁḍam̐gā nikki sūsi jagaḍiṁchi nī nĕlam̐ta yemannā nīvaṁṭa gādā kānigāni vŏṭlado kadisidi middaramu monāna nūraguṁḍide mŏttu maṁṭa gādā (||sālurā||) hidavai sarasamu ne niḍu nīdo nāḍam̐gā sadi jaṁkiṁchinadi nī saliga gādā padigā sāgirimāḍa palugu maṁṭe navvevu madagānam̐ baga dīrsemāya nīdi gādā (||sālurā||) yĕgasakkenagu nābai yīḍi sūbu sūḍam̐gānu mŏgamoḍāna nuṁṭe nī muddule kādā vĕgalivai yiddari śhrīveṁkaḍeśha kūḍam̐baṭṭi vŏgaḍam̐ gaum̐giliṁchidi vŏḍam̐bāḍu gādā