Title (Indic)చాలునిదే నా నిరతి సకలసామ్రాజ్యము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలునిదే నా నిరతి సకలసామ్రాజ్యము నాలోని పని యెంతైనా నాకుఁ గలదు (॥చాలు॥) వడఁబడి పరులిండ్లవాకిలి గాచే నేను వడి నాలో హరియున్న వాకిలి గాచేను బడి నొకరిఁ గొలిచి బహురాజ్యమేలే నేను యెడ నామనోరాజ్యమింతా నేలేను (॥చాలు॥) చేరి యొరులకుఁ బనిసేసి యలసే నేను సారె నాయోగాభ్యాసాన నలసేను అరసి నే నడుగఁగ నన్యులిచ్చేయీవులు తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని (॥చాలు॥) అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల- మందును మాయాకల్పిత మిందును మాయే అందు నిందు శ్రీవేంకటాధీశుఁడే కర్త అందైతేఁ బరతంత్రుఁడిందు నే స్వతంత్రుఁడ English(||pallavi||) sālunide nā niradi sagalasāmrājyamu nāloni pani yĕṁtainā nāgum̐ galadu (||sālu||) vaḍam̐baḍi paruliṁḍlavāgili gāse nenu vaḍi nālo hariyunna vāgili gāsenu baḍi nŏgarim̐ gŏlisi bahurājyamele nenu yĕḍa nāmanorājyamiṁtā nelenu (||sālu||) seri yŏrulagum̐ banisesi yalase nenu sārĕ nāyogābhyāsāna nalasenu arasi ne naḍugam̐ga nanyulichcheyīvulu tāri pūrvagarmādidaivame yichchīni (||sālu||) aṁdu saṁtoṣhame phala miṁdu saṁtoṣhame phala- maṁdunu māyāgalbida miṁdunu māye aṁdu niṁdu śhrīveṁkaḍādhīśhum̐ḍe karda aṁdaidem̐ baradaṁtrum̐ḍiṁdu ne svadaṁtrum̐ḍa