Title (Indic)చాలునె చాలునె సట లిఁకనూ ని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలునె చాలునె సట లిఁకనూ ని- న్నేలిన పతికడ కేఁగగరాదా (॥చాలు॥) పెంచినఁ బెరుగును పెనునీచలములు నించిన కొప్పునెరులవలె వంచిన వాలును వడి నీకోపము చుంచులనీకనుచూపులవలెను (॥చాలు॥) కరఁచినఁ గరఁగును కలికి నీమనసు పరుగునీకాంతులపసిఁడివలె మరపిన మరగును మహి నీగుణములు పెరతేనేలనీపెదవులవలెను (॥చాలు॥) కదిసిన గద్దా కాంక్ష నీరతులు ముదిరిన నీకుచములవలెను యెదురనె శ్రీవేంకటేశుఁడు గూడెను పదవులజవ్వనసాయమువలెను English(||pallavi||) sālunĕ sālunĕ saḍa lim̐kanū ni- nnelina padigaḍa kem̐gagarādā (||sālu||) pĕṁchinam̐ bĕrugunu pĕnunīsalamulu niṁchina kŏppunĕrulavalĕ vaṁchina vālunu vaḍi nīgobamu suṁchulanīganusūbulavalĕnu (||sālu||) karam̐sinam̐ garam̐gunu kaligi nīmanasu parugunīgāṁtulabasim̐ḍivalĕ marabina maragunu mahi nīguṇamulu pĕradenelanībĕdavulavalĕnu (||sālu||) kadisina gaddā kāṁkṣha nīradulu mudirina nīgusamulavalĕnu yĕduranĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu padavulajavvanasāyamuvalĕnu