Title (Indic)చాలునే నీ మాఁటలు చాలు మూలకెక్కెరా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలునే నీ మాఁటలు చాలు మూలకెక్కెరా నేలఁ జూపేవా పదారువేలవాఁడ వౌదురా (॥చాలు॥) వొంటినుందాన వదేమే వొంటియు నొంటకె పోరా అంటఁగా వోచెలియ గోరంట కౌనౌరా గొటుజాణతనమేలే కూళతనాలేలరా కంటినే నీజాడ బండికంటిజాడలటరా (॥చాలు॥) వీడనాడేవేమే నీవీడనాడ నుండఁగఁబో జోడుగదే నేను అవురా జోడగుటౌళి మేడిసేసేవటే నీవు మేడిపండె నీగుణాలు వోడ వేమిటాను నీవావోడతో దూలమురా (॥చాలు॥) యింతయేలే నాతోఁ గారింతలు నీవల్లనే పో సంతమైతినే వో వసంతకాఁడవా పంతపు శ్రీవేంకటాద్రిపతి నేఁ గూడితిఁగదే పంతము పాడియుఁగలపడఁతిరా నేను English(||pallavi||) sālune nī mām̐ṭalu sālu mūlagĕkkĕrā nelam̐ jūbevā padāruvelavām̐ḍa vaudurā (||sālu||) vŏṁṭinuṁdāna vademe vŏṁṭiyu nŏṁṭagĕ porā aṁṭam̐gā vosĕliya goraṁṭa kaunaurā gŏḍujāṇadanamele kūḽadanālelarā kaṁṭine nījāḍa baṁḍigaṁṭijāḍalaḍarā (||sālu||) vīḍanāḍeveme nīvīḍanāḍa nuṁḍam̐gam̐bo joḍugade nenu avurā joḍaguḍauḽi meḍisesevaḍe nīvu meḍibaṁḍĕ nīguṇālu voḍa vemiḍānu nīvāvoḍado dūlamurā (||sālu||) yiṁtayele nādom̐ gāriṁtalu nīvallane po saṁtamaidine vo vasaṁtagām̐ḍavā paṁtabu śhrīveṁkaḍādribadi nem̐ gūḍidim̐gade paṁtamu pāḍiyum̐galabaḍam̐tirā nenu