Title (Indic)చాలుఁజాలు రోఁతలూ సటలాయఁ బనులూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు రోఁతలూ సటలాయఁ బనులూ తాలిమిలేనిదానను తడవకువయ్యా (॥చాలుఁ॥) మాటలాడితివొ లేదో మగువతో నేఁ జూడఁగ మాట లిఁక నాకు నీతో మఱి యాల తేటగా నవ్వితొ లేదొ తేరకొని ఆకేతోనే యీటుకు నీతో నవ్వ నిఁకనేలయ్యా (॥చాలుఁ॥) తప్పక చూచితొ లేదో తరుణిమొగ మప్పుడు యిప్పుడు నే నిది చూడ ఇత వవునా వొప్పి దగ్గరితొ లేదొ వున్నచో ఆకెను నీవు యిప్పుడు నిన్ను దగ్గర నింపవునటయ్యా (॥చాలుఁ॥) కాఁగిలించితివొ లేదొ కాంత నల్లనాఁడు నీవు కాఁగిలించితి నేఁడు కమ్మటినిన్ను వీఁగక శ్రీవేంకటేశ వేమారు సాదించనోప మాఁగినరతులఁ బెనుమాయ లింకేలా English(||pallavi||) sālum̐jālu rom̐talū saḍalāyam̐ banulū tālimilenidānanu taḍavaguvayyā (||sālum̐||) māḍalāḍidivŏ ledo maguvado nem̐ jūḍam̐ga māḍa lim̐ka nāgu nīdo maṟi yāla teḍagā navvidŏ ledŏ teragŏni āgedone yīḍugu nīdo navva nim̐kanelayyā (||sālum̐||) tappaga sūsidŏ ledo taruṇimŏga mappuḍu yippuḍu ne nidi sūḍa ida vavunā vŏppi daggaridŏ ledŏ vunnaso āgĕnu nīvu yippuḍu ninnu daggara niṁpavunaḍayyā (||sālum̐||) kām̐giliṁchidivŏ ledŏ kāṁta nallanām̐ḍu nīvu kām̐giliṁchidi nem̐ḍu kammaḍininnu vīm̐gaga śhrīveṁkaḍeśha vemāru sādiṁchanoba mām̐ginaradulam̐ bĕnumāya liṁkelā