Title (Indic)చాలుఁజాలు దీమసము సతిమాట వినవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు దీమసము సతిమాట వినవయ్య మేలుగలవాఁడవు గామిడిచేఁతలేలా (॥చాలు ॥) అవ్వలిమోమైనపరా కంత గలవాఁడవైతే జవ్వనిఁ గాంతలచే విచారించనేల నవ్వకపిలిచినాను నాలిసేసేవాఁడవైతే పువ్వులవలె నీమేను పులకించనేలా (॥చాలు॥) యింటిలోననుండి బీరా లింత గలవాఁడవైతే అంటి నాఁడు సరసములాడఁగనేల వొంటి నే మాటాడినా వూఁకొననివాఁడవైతే అంటుముట్టుచెమటల నలయఁగనేలా (॥చాలు॥) కాలుదొక్కి యింతలోనే కళదాఁకే వాఁడవైతే బాలకితో నలి గింత పాయఁగనేల మేలిమి శ్రీవేంకటేశ మెచ్చితి నీగుణము వేళతోఁగూడితి వింత వేగిరించనేల English(||pallavi||) sālum̐jālu dīmasamu sadimāḍa vinavayya melugalavām̐ḍavu gāmiḍisem̐talelā (||sālu ||) avvalimomainabarā kaṁta galavām̐ḍavaide javvanim̐ gāṁtalase visāriṁchanela navvagabilisinānu nālisesevām̐ḍavaide puvvulavalĕ nīmenu pulagiṁchanelā (||sālu||) yiṁṭilonanuṁḍi bīrā liṁta galavām̐ḍavaide aṁṭi nām̐ḍu sarasamulāḍam̐ganela vŏṁṭi ne māḍāḍinā vūm̐kŏnanivām̐ḍavaide aṁṭumuṭṭusĕmaḍala nalayam̐ganelā (||sālu||) kāludŏkki yiṁtalone kaḽadām̐ke vām̐ḍavaide bālagido nali giṁta pāyam̐ganela melimi śhrīveṁkaḍeśha mĕchchidi nīguṇamu veḽadom̐gūḍidi viṁta vegiriṁchanela