Title (Indic)చాలుఁ జాలుఁ దొలఁగవో జాలికోపమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలుఁ దొలఁగవో జాలికోపమా సోలుచు హరిమఱుఁగు చొచ్చితినో కోపమా (॥చాలు॥) నీననుఁ బరులు దిట్టితే నాకు వాసు లెక్కించి వెనకనే వత్తువుగా వెఱ్ఱికోపమా ధనము కొఱకుగాఁ దగవులఁ బెట్టి పెట్టి ఘనుల నెఱుఁగనీవుగా కోపమా (॥చాలు॥) తనివి నవ్వుచు వచ్చి తల మొల విడఁగాను శివ మెత్తించితిగా ముంచిన కోపమా జవళిఁ జదివినట్టి సారవువిజ్ఞాని నైనా వివరము చెఱుతుగా వేఁదుఱు కోపమా (॥చాలు॥) బుద్ధులు వినఁగనీక బూతుబండు గెలయించి పెద్దరికము చెరచే బేలు కోపమా అద్దో శ్రీవేంకటేశుఁ డాదరించి నన్ను నేలె వుద్దండాలు చెల్లవిఁక వుడుగవో కోపమా English(||pallavi||) sālum̐ jālum̐ dŏlam̐gavo jāligobamā solusu harimaṟum̐gu sŏchchidino kobamā (||sālu||) nīnanum̐ barulu diṭṭide nāgu vāsu lĕkkiṁchi vĕnagane vattuvugā vĕṭrigobamā dhanamu kŏṟagugām̐ dagavulam̐ bĕṭṭi pĕṭṭi ghanula nĕṟum̐ganīvugā kobamā (||sālu||) tanivi navvusu vachchi tala mŏla viḍam̐gānu śhiva mĕttiṁchidigā muṁchina kobamā javaḽim̐ jadivinaṭṭi sāravuvijñāni nainā vivaramu sĕṟudugā vem̐duṟu kobamā (||sālu||) buddhulu vinam̐ganīga būdubaṁḍu gĕlayiṁchi pĕddarigamu sĕrase belu kobamā addo śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannu nelĕ vuddaṁḍālu sĕllavim̐ka vuḍugavo kobamā