Title (Indic)చాలుఁ జాలుఁ బొగడకు జాణకాఁడే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలుఁ బొగడకు జాణకాఁడే నాలి నేఁ దనిసితిఁ బో నాఁడు నాఁడే (॥చాలు॥) తనకు వలచినట్టి తరుణి సూర్పనకను పెను ముక్కుగోసిన బీరగాఁదే మునుపనె వుపకారము నున్న బలి నట్టె పనివడి కట్టినట్టి పంతగాఁడే (॥చాలు॥) కోరి తన్నుఁ గూడినట్టి గొల్లల మానములు మేర మీరి చేకొనిన మేటివాఁడే కౌరవులఁ బాండవులఁ గడుఁ జుట్టాల నెల్ల పోరువెట్టి యంపినట్టి పుణ్యపువాఁడే (॥చాలు॥) నిండు వురమున నింతి నిలిపి శ్రీ వెంకటాద్రి కొండమీఁద నెక్కుకొన్న కోడెకాఁడే అండనిట్టె నన్నుఁ గూడి ఆయము లంటిమెప్పించి దండియై మెరసినట్టి దైవపువాఁడే English(||pallavi||) sālum̐ jālum̐ bŏgaḍagu jāṇagām̐ḍe nāli nem̐ danisidim̐ bo nām̐ḍu nām̐ḍe (||sālu||) tanagu valasinaṭṭi taruṇi sūrbanaganu pĕnu mukkugosina bīragām̐de munubanĕ vubagāramu nunna bali naṭṭĕ panivaḍi kaṭṭinaṭṭi paṁtagām̐ḍe (||sālu||) kori tannum̐ gūḍinaṭṭi gŏllala mānamulu mera mīri segŏnina meḍivām̐ḍe kauravulam̐ bāṁḍavulam̐ gaḍum̐ juṭṭāla nĕlla poruvĕṭṭi yaṁpinaṭṭi puṇyabuvām̐ḍe (||sālu||) niṁḍu vuramuna niṁti nilibi śhrī vĕṁkaḍādri kŏṁḍamīm̐da nĕkkugŏnna koḍĕgām̐ḍe aṁḍaniṭṭĕ nannum̐ gūḍi āyamu laṁṭimĕppiṁchi daṁḍiyai mĕrasinaṭṭi daivabuvām̐ḍe