Title (Indic)చాలుఁ జాలు నున్న వెల్లాఁ జాలదా యిది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నున్న వెల్లాఁ జాలదా యిది జాలెలా నిందునే పాసెఁ జాలదా యిది (॥॥) గొరబుగా నవ్వితేనుకోపగించుకొనక సరిగా నీవు నవ్వితి చాలదా ఇది తరవై కొంగువట్టితేఁ దప్పించుకొనక సరవి నూరకుండితి చాలదా ఇది (॥॥) కన్నుల నేఁ బిలిచితే కమ్మర జంకించక సన్నలకే వచ్చితివి చాలదా ఇది నిన్నుఁ దప్పకచూచితే నిలిచి వాదుక రాక జన్నెవలపు చల్లితి చాలదా ఇది (॥॥) తమితో నిన్నుఁ గూడఁగా దప్పులనుఁ బొరలక సమరతిఁజొక్కితివి చాలదా ఇది అమర శ్రీ వేంకటేశ అనుమాన మెంచక జమళిఁగూచుంటి విట్లె చాలదా యిది English(||pallavi||) sālum̐ jālu nunna vĕllām̐ jāladā yidi jālĕlā niṁdune pāsĕm̐ jāladā yidi (||||) gŏrabugā navvidenugobagiṁchugŏnaga sarigā nīvu navvidi sāladā idi taravai kŏṁguvaṭṭidem̐ dappiṁchugŏnaga saravi nūraguṁḍidi sāladā idi (||||) kannula nem̐ biliside kammara jaṁkiṁchaga sannalage vachchidivi sāladā idi ninnum̐ dappagasūside nilisi vāduga rāga jannĕvalabu sallidi sāladā idi (||||) tamido ninnum̐ gūḍam̐gā dappulanum̐ bŏralaga samaradim̐jŏkkidivi sāladā idi amara śhrī veṁkaḍeśha anumāna mĕṁchaga jamaḽim̐gūsuṁṭi viṭlĕ sāladā yidi