Title (Indic)చాలుఁ జాలు నీతోడి సరసాలు యిట్టె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నీతోడి సరసాలు యిట్టె పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి (॥చాలు॥) సిగ్గువడితిమిర నీ చేసిన చేఁతలకు- నగ్గమైతిమిర మరునమ్ములకును దగ్గరి నీకాఁకలఁ దగులఁబట్టి నేఁడు బగ్గన నిందరిలోనఁ బలచనైతిమి (॥చాలు॥) నొగిలితిమిర నేము నోఁచిన నోములకు పొగిలితిమిర నీపొందులకును తెగి నీవు నన్ను రతిఁదేలించి తేలించి నాకు పగటు బిగువులెల్లఁ బచ్చిగాఁ జేసితివి (॥చాలు॥) దప్పిఁ బడితిమిర నీతాలిములనే కడు నొప్పిఁ బడితిమీర నీ నొక్కుఁజేఁతల ఇప్పుడిట్టె తిరువేంకటేశుఁడ నీవు నా- కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము English(||pallavi||) sālum̐ jālu nīdoḍi sarasālu yiṭṭĕ pāliṁḍla kŏṁgujāri bayaḍam̐ baḍidimi (||sālu||) sigguvaḍidimira nī sesina sem̐talagu- naggamaidimira marunammulagunu daggari nīgām̐kalam̐ dagulam̐baṭṭi nem̐ḍu baggana niṁdarilonam̐ balasanaidimi (||sālu||) nŏgilidimira nemu nom̐sina nomulagu pŏgilidimira nībŏṁdulagunu tĕgi nīvu nannu radim̐deliṁchi teliṁchi nāgu pagaḍu biguvulĕllam̐ bachchigām̐ jesidivi (||sālu||) dappim̐ baḍidimira nīdālimulane kaḍu nŏppim̐ baḍidimīra nī nŏkkum̐jem̐tala ippuḍiṭṭĕ tiruveṁkaḍeśhum̐ḍa nīvu nā- kŏppu savaramu dīsi kŏllagŏṁṭi mānamu