Title (Indic)చాలుఁ జాలు నీ సటలఁ బొరలితిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నీ సటలఁ బొరలితిమి వాలి కొంత వెరవకుమనలేవు (॥చాపుఁ॥) కలవు లోకముల ఘనమంత్రంబులు అలరి ముక్తి యియ్యఁగలేవు సులభానఁ గలరు సొరిది దేవతలు వలగొను పాపము వారించలేరు (॥చాపుఁ॥) వున్నవి పుణ్యము లూరకె యివిగో పన్నిన హరిఁ జూపఁగలేవు సన్నితి నున్నవి సకళశాస్త్రములు కొన్నైన భవములకొన గన నీవు (॥చాపుఁ॥) ధరలో సేనలు ధనధాన్యంబులు పరమజ్ఞానవిభవ మిదు అరుదుగ శ్రీవేంకటాధిపుఁడే మము యిరవై కావఁగ యీడేరితిమి English(||pallavi||) sālum̐ jālu nī saḍalam̐ bŏralidimi vāli kŏṁta vĕravagumanalevu (||sābum̐||) kalavu logamula ghanamaṁtraṁbulu alari mukti yiyyam̐galevu sulabhānam̐ galaru sŏridi devadalu valagŏnu pābamu vāriṁchaleru (||sābum̐||) vunnavi puṇyamu lūragĕ yivigo pannina harim̐ jūbam̐galevu sannidi nunnavi sagaḽaśhāstramulu kŏnnaina bhavamulagŏna gana nīvu (||sābum̐||) dharalo senalu dhanadhānyaṁbulu paramajñānavibhava midu aruduga śhrīveṁkaḍādhibum̐ḍe mamu yiravai kāvam̐ga yīḍeridimi