Title (Indic)చాలుఁ జాలు నే మన్నఁ జవి గావు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నే మన్నఁ జవి గావు కూళతన మింతే నిన్నుఁ గొసరఁ బోతేను (॥చాలు జాలు॥) ఉమ్మగిలుఁ జిత్తముతో నుడుకుతా నుండేనన్ను యెమ్మెలకుఁ జెనకేవు యేరా నీవూ తమ్మి మొగ్గవాట్లకె తల్లడించే నామేను నిమ్మపంట వేసేవు నే నోపఁ గలనా (॥చాలు జాలు॥) చెక్కు చేతఁ బెట్టుకొని చింతఁ బొరలెడినాతో యెక్కువఁ గేరడా లాడే వేరా నీవూ మొక్కలాన నీకు దక్కి మోసపోయి వున్న నన్ను తోక్కేవు నాకాలు వట్టి దూరప్పటి వలెనా (॥చాలుజాలు॥) వులుకుట్టుఁజేఁతలకు నుస్సు రంటా నున్ననాతో యెలయించి నవ్వు నవ్వే వేరా నీవూ నెలవై శ్రీ వెంకటేశ నిన్నుఁ గూడి యలసితి బలిమిఁ గాఁగిట నిఁక పచ్చి సేయ వలెనా English(||pallavi||) sālum̐ jālu ne mannam̐ javi gāvu kūḽadana miṁte ninnum̐ gŏsaram̐ bodenu (||sālu jālu||) ummagilum̐ jittamudo nuḍugudā nuṁḍenannu yĕmmĕlagum̐ jĕnagevu yerā nīvū tammi mŏggavāṭlagĕ tallaḍiṁche nāmenu nimmabaṁṭa vesevu ne nobam̐ galanā (||sālu jālu||) sĕkku sedam̐ bĕṭṭugŏni siṁtam̐ bŏralĕḍinādo yĕkkuvam̐ geraḍā lāḍe verā nīvū mŏkkalāna nīgu dakki mosaboyi vunna nannu tokkevu nāgālu vaṭṭi dūrappaḍi valĕnā (||sālujālu||) vuluguṭṭum̐jem̐talagu nussu raṁṭā nunnanādo yĕlayiṁchi navvu navve verā nīvū nĕlavai śhrī vĕṁkaḍeśha ninnum̐ gūḍi yalasidi balimim̐ gām̐giḍa nim̐ka pachchi seya valĕnā