Title (Indic)చాలుఁ జాలు మాతోను సటలేఁటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు మాతోను సటలేఁటికి కోలు ముందుగా మాతో గుట్టు సేయవలెనా (॥చాలుఁ॥) పంతగాఁడవు నీమోవి పచ్చి ఇంతేటికాయ చింతలేనివాఁడవేల చెమరించేవు బంతినున్నా రిద్దరును భావములు గానవచ్చె కొంత గొంత మాతోను గుట్టుసేయవలెనా (॥చాలుఁ॥) మనసుగలవాఁడవు మాటలేఁటికాఁడవు కినిసినవాఁడవేల కిందుపడేవు పెనఁగేరు మీలోని ప్రియమెల్లఁగానవచ్చె కొనబుఁజేఁతల మాతో గుట్టు సేయవలెనా (॥చాలుఁ॥) తమకించనివాఁడవు తగవులేల పెట్టేవు తెమలనివాడవేల తేరి చూచేవు అమర శ్రీ వేంకటేశ ఆపె నన్నుఁ గూడితివి గుమతాన మాతో నింత గుట్టు సేయవలెనా English(||pallavi||) sālum̐ jālu mādonu saḍalem̐ṭigi kolu muṁdugā mādo guṭṭu seyavalĕnā (||sālum̐||) paṁtagām̐ḍavu nīmovi pachchi iṁteḍigāya siṁtalenivām̐ḍavela sĕmariṁchevu baṁtinunnā riddarunu bhāvamulu gānavachchĕ kŏṁta gŏṁta mādonu guṭṭuseyavalĕnā (||sālum̐||) manasugalavām̐ḍavu māḍalem̐ṭigām̐ḍavu kinisinavām̐ḍavela kiṁdubaḍevu pĕnam̐geru mīloni priyamĕllam̐gānavachchĕ kŏnabum̐jem̐tala mādo guṭṭu seyavalĕnā (||sālum̐||) tamagiṁchanivām̐ḍavu tagavulela pĕṭṭevu tĕmalanivāḍavela teri sūsevu amara śhrī veṁkaḍeśha ābĕ nannum̐ gūḍidivi gumadāna mādo niṁta guṭṭu seyavalĕnā