Title (Indic)సాలు సాలు మాటలు సక్కనుండవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాలు సాలు మాటలు సక్కనుండవు జోలికాఁడ మమ్ము నేల సొలసేవు నీవు (॥సాలు॥) వుట్ల మీఁదటి సుద్దు లో హో యిన్ని యాసారాలు సెట్లు శామలలోని సేఁతలు మావి వుట్లు వూరువా లెత్తి పొగడుదునో వుండేవో గట్టు మా సన్ను లేల కదిసేవు నీవు (॥సాలు॥) మందగోసుటాలలోనిమనికి నీవుండేది పందిటిగవులలోని పడుక మాది చిందరవందరపని చెప్పుదునో వుండేవో అందనిపండ్ల కేల యఱ్ఱు చాఁచే విపుడు (॥సాలు॥) పిల్లఁగోవి రాగాలు పెలుసు నీ మాటలు కొల్లగా మఱి పిక కూఁతలు మావి యెల్లగా శ్రీవేంకటేశ యిట్టే మమ్ముఁ గూడితివి సెల్లు నీకు నేమయినా సేయవయ్య యింకను English(||pallavi||) sālu sālu māḍalu sakkanuṁḍavu joligām̐ḍa mammu nela sŏlasevu nīvu (||sālu||) vuṭla mīm̐daḍi suddu lo ho yinni yāsārālu sĕṭlu śhāmalaloni sem̐talu māvi vuṭlu vūruvā lĕtti pŏgaḍuduno vuṁḍevo gaṭṭu mā sannu lela kadisevu nīvu (||sālu||) maṁdagosuḍālalonimanigi nīvuṁḍedi paṁdiḍigavulaloni paḍuga mādi siṁdaravaṁdarabani sĕppuduno vuṁḍevo aṁdanibaṁḍla kela yaṭru sām̐se vibuḍu (||sālu||) pillam̐govi rāgālu pĕlusu nī māḍalu kŏllagā maṟi piga kūm̐talu māvi yĕllagā śhrīveṁkaḍeśha yiṭṭe mammum̐ gūḍidivi sĕllu nīgu nemayinā seyavayya yiṁkanu