Title (Indic)చాలు నూరకుండవయ్య సడి కేల వచ్చీనో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలు నూరకుండవయ్య సడి కేల వచ్చీనో నాలి నే మోనాన నుంటే నన్నుఁ దడవేవా (॥పల్లవి॥) ఆడితి నే నొకమాఁట అందిరివలెనె నేను యీడ నెగ్గైనఁ జేసుకో యిత వైనఁ జేసుకో వీడె మియ్య నే రాఁగా విందు వెట్టి పగ లాయ వాడలో నాయింట నుంటే వాదు వెట్టుకొనేవా (॥చాలు॥) మగిడి చూచితి నింతే మగఁడ మంటా నేను నగినా నగుము కాదాన్నా నన్నుఁ గా దను వగచితి నీకు నేను వడిఁ జల్ల వేఁ డాయ మగవాఁడ నై పట్టితే మచ్చరించేవా (॥చాలు॥) పాదము లొత్తితి నింతే బడలి వచ్చితి వంటా సేదతో వెంగెము నీకు సేవగాఁ గైకొంటివో ఆదరించి శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి వేద దీర నే మొక్కితే వీడఁగ నాడేవా English(||pallavi||) sālu nūraguṁḍavayya saḍi kela vachchīno nāli ne monāna nuṁṭe nannum̐ daḍavevā (||pallavi||) āḍidi ne nŏgamām̐ṭa aṁdirivalĕnĕ nenu yīḍa nĕggainam̐ jesugo yida vainam̐ jesugo vīḍĕ miyya ne rām̐gā viṁdu vĕṭṭi paga lāya vāḍalo nāyiṁṭa nuṁṭe vādu vĕṭṭugŏnevā (||sālu||) magiḍi sūsidi niṁte magam̐ḍa maṁṭā nenu naginā nagumu kādānnā nannum̐ gā danu vagasidi nīgu nenu vaḍim̐ jalla vem̐ ḍāya magavām̐ḍa nai paṭṭide machchariṁchevā (||sālu||) pādamu lŏttidi niṁte baḍali vachchidi vaṁṭā sedado vĕṁgĕmu nīgu sevagām̐ gaigŏṁṭivo ādariṁchi śhrīvĕṁkaḍādhiba nannum̐ gūḍidi veda dīra ne mŏkkide vīḍam̐ga nāḍevā