Title (Indic)చాలు నూరకే రావయ్య సారె సారె రేఁచక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలు నూరకే రావయ్య సారె సారె రేఁచక కోలుముందై నీ ప్రియాలు కొంకులుదేరీ నవె (॥చాలు॥) గరిసించరాదుగాని కాంతకు నీచేఁతలెల్లా తెరమఱఁగు దీసితే తిద్దరానివే వరుసతో రావుగాని వన్నెల నీగుణములు తొరలించుకొంటేను దొమ్మిసేసేవే (॥చాలు॥) వెలఇంచరాదుగాని వెలఁదికి నీ నవ్వులు తెలిపి చెప్పఁగఁబోతే తీగెసాగేవే తలఁచఁగరాదుగాని తప్పని నీబాసలెల్లా ములిగి మోవఁగఁబోతే మోఁపెఁడేసివే (॥చాలు॥) ఇయ్యకొనరాదుగాని యింతికి నీ కూటములు చెయ్యారఁ గాఁగిట నేఁడు చేకొన్నవే ఇయ్యెడ శ్రీ వేంకటేశ యిద్దరూ నొక్కటైతిరి ముయ్యఁబోతే మీఁద మీఁద మొనలు చూపేటివే English(||pallavi||) sālu nūrage rāvayya sārĕ sārĕ rem̐saga kolumuṁdai nī priyālu kŏṁkuluderī navĕ (||sālu||) garisiṁcharādugāni kāṁtagu nīsem̐talĕllā tĕramaṟam̐gu dīside tiddarānive varusado rāvugāni vannĕla nīguṇamulu tŏraliṁchugŏṁṭenu dŏmmiseseve (||sālu||) vĕla̮iṁcharādugāni vĕlam̐digi nī navvulu tĕlibi sĕppam̐gam̐bode tīgĕsāgeve talam̐sam̐garādugāni tappani nībāsalĕllā muligi movam̐gam̐bode mom̐pĕm̐ḍesive (||sālu||) iyyagŏnarādugāni yiṁtigi nī kūḍamulu sĕyyāram̐ gām̐giḍa nem̐ḍu segŏnnave iyyĕḍa śhrī veṁkaḍeśha yiddarū nŏkkaḍaidiri muyyam̐bode mīm̐da mīm̐da mŏnalu sūbeḍive