Title (Indic)చాలు నింక నిటువంటి సంసారము మరుని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలు నింక నిటువంటి సంసారము మరుని పాలైతి నిపు డింటి భాగ్యమిది నాకు (॥చాలు॥) తనియు కిటు నీవు గాంతల నెల్లనా యెదుట గొనియాడ దొరకొంటి కొంకులేక వినియుఁ బ్రాణము తోడ విషమైన యీకూడు దినఁజేరినది యేఁటి దేహ మిది నాకు (॥చాలు॥) వెఱవ కిటు సతుల నీ వెను వెంటఁ బెట్టుకొని మెఱయ దొరకొంటివిదె మేరలేక యెఱిఁగియునుఁ దీపనుచు నిట్టి నీ మన్ననల చెఱఁబెట్టినది యేఁటి జీవమిది నాకు (॥చాలు॥) ఎక్కువగు నీతరుణు లిందరిని నాకిట్ల మ్రొక్కించ దొరకొంటి మొఱఁగు లేక గ్రక్కునను నన్ను వేంకటగిరీశ్వర కలసి చిక్కనైతివి చాలుఁ జిన్నమిది నాకు English(||pallavi||) sālu niṁka niḍuvaṁṭi saṁsāramu maruni pālaidi nibu ḍiṁṭi bhāgyamidi nāgu (||sālu||) taniyu kiḍu nīvu gāṁtala nĕllanā yĕduḍa gŏniyāḍa dŏragŏṁṭi kŏṁkulega viniyum̐ brāṇamu toḍa viṣhamaina yīgūḍu dinam̐jerinadi yem̐ṭi deha midi nāgu (||sālu||) vĕṟava kiḍu sadula nī vĕnu vĕṁṭam̐ bĕṭṭugŏni mĕṟaya dŏragŏṁṭividĕ meralega yĕṟim̐giyunum̐ dībanusu niṭṭi nī mannanala sĕṟam̐bĕṭṭinadi yem̐ṭi jīvamidi nāgu (||sālu||) ĕkkuvagu nīdaruṇu liṁdarini nāgiṭla mrŏkkiṁcha dŏragŏṁṭi mŏṟam̐gu lega grakkunanu nannu veṁkaḍagirīśhvara kalasi sikkanaidivi sālum̐ jinnamidi nāgu