Title (Indic)చాలు లేరె మీ రేల చక్కటులు చెప్పెరె WorkAnnamayya songs LanguageTelugu Role Artist Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(active tab)EnglishTelugu(॥పల్లవి॥) చాలు లేరె మీ రేల చక్కటులు చెప్పెరె మేలు గలవారికి మెచ్చకుండఁ జెల్లునా (॥చాలు॥) వలచినవాఁ డైతె వద్దికి తా వచ్చుఁ గాక అలిగి తా నెడమాఁట లాడించునా చెలిమే కలిగితేను సిగ్గుపడవలెఁ గాక వొలసీనొల్లముతో నూరకుండఁ జెల్లునా (॥చాలు॥) ప్రియమే కలిగితేను పిలువ రావలెఁ గాక దయ లేక యింతవడి తామసించునా నయమే కలిగితేను నమ్మించవలెఁ గాక భయము లే కింతవడి పట్టెడఁ జెల్లునా (॥చాలు॥) ఆసలే కలిగితేను అలముకోవలెఁ గాక యీసున మరి యెగ్గు లెంచఁ జెల్లునా వేసాలు మాని నన్ను శ్రీవెంకటనాథుఁడు గూడె వాసు లెంచి యాతఁ డిఁక వాదించఁ జెల్లునా. English(||pallavi||) sālu lerĕ mī rela sakkaḍulu sĕppĕrĕ melu galavārigi mĕchchaguṁḍam̐ jĕllunā (||sālu||) valasinavām̐ ḍaidĕ vaddigi tā vachchum̐ gāga aligi tā nĕḍamām̐ṭa lāḍiṁchunā sĕlime kaligidenu siggubaḍavalĕm̐ gāga vŏlasīnŏllamudo nūraguṁḍam̐ jĕllunā (||sālu||) priyame kaligidenu piluva rāvalĕm̐ gāga daya lega yiṁtavaḍi tāmasiṁchunā nayame kaligidenu nammiṁchavalĕm̐ gāga bhayamu le kiṁtavaḍi paṭṭĕḍam̐ jĕllunā (||sālu||) āsale kaligidenu alamugovalĕm̐ gāga yīsuna mari yĕggu lĕṁcham̐ jĕllunā vesālu māni nannu śhrīvĕṁkaḍanāthum̐ḍu gūḍĕ vāsu lĕṁchi yādam̐ ḍim̐ka vādiṁcham̐ jĕllunā.