Title (Indic)చాలవా నీ మన్ననలు సముకాన నివె మాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలవా నీ మన్ననలు సముకాన నివె మాకు కేలు చాఁచి కొసరేనా కిమ్ముల నింకాను (॥చాలా॥) ఆదికొని నీవు నాతో నట్టె యేల పెసఁగేవు కాదంటినా నీతో పొందు కలకాలము పోదితో నప్పటినేల పొదిగి వేఁడుకొనేవు సాదించేనా నీతో చలము లింకాను (॥చాలా॥) గుట్టుగోడ నీవేల కొంగువట్టి తీసేవు వెట్టిచుట్టాలమా నిన్ను వేసరించను బట్టబయల నింతేల పైపైఁ దమకించేవు తట్టి నామనసు నీకు దాఁచేనా ఇంకాను (॥చాలా॥) కందువ లాలించి యేల కాఁగిట బిగించేవు నింద లెంచి తప్పు మోపి నిన్ను మీరేనా ఇందరిలోశ్రీవేంకటేశ నన్ను నేలితివి అందుకోలుజాణతనా లాడేనా ఇంకాను English(||pallavi||) sālavā nī mannanalu samugāna nivĕ māgu kelu sām̐si kŏsarenā kimmula niṁkānu (||sālā||) ādigŏni nīvu nādo naṭṭĕ yela pĕsam̐gevu kādaṁṭinā nīdo pŏṁdu kalagālamu podido nappaḍinela pŏdigi vem̐ḍugŏnevu sādiṁchenā nīdo salamu liṁkānu (||sālā||) guṭṭugoḍa nīvela kŏṁguvaṭṭi tīsevu vĕṭṭisuṭṭālamā ninnu vesariṁchanu baṭṭabayala niṁtela paibaim̐ damagiṁchevu taṭṭi nāmanasu nīgu dām̐senā iṁkānu (||sālā||) kaṁduva lāliṁchi yela kām̐giḍa bigiṁchevu niṁda lĕṁchi tappu mobi ninnu mīrenā iṁdarilośhrīveṁkaḍeśha nannu nelidivi aṁdugolujāṇadanā lāḍenā iṁkānu