Title (Indic)రమణి సురటిగాఁ జెరఁగు వీచీని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రమణి సురటిగాఁ జెరఁగు వీచీని చెమరించెనంటాఁ జెలి దూరీని (॥రమణి॥) కలగంటినంటా కాటుకకనుల నీరు వొలకఁగా మలగు పై నుసురనీని తల నొచ్చీనంటా దంతపుటోవరిలోన పలుకదు పిలిచినాఁ బవ్వళించీని (॥రమణి॥) తొలఁగితినంటా తూఁగుమంచముమీఁ ద సెలవినవ్వులతోడ శిరసూఁచీని అలసితినంటా నలరుఁబానుపుఁ మీద పులకలమేనితోఁ బొరలెడిని (॥రమణి॥) సొరిగితినంటా సురతపరవశాన- నరవిరి కనురెప్పలల్లాడించీని తిరమాయనంటాఁ దిరువేంకటేశ్వరుఁ దరుణి గలసి యింకాఁ దమకించీని English(||pallavi||) ramaṇi suraḍigām̐ jĕram̐gu vīsīni sĕmariṁchĕnaṁṭām̐ jĕli dūrīni (||ramaṇi||) kalagaṁṭinaṁṭā kāḍugaganula nīru vŏlagam̐gā malagu pai nusuranīni tala nŏchchīnaṁṭā daṁtabuḍovarilona palugadu pilisinām̐ bavvaḽiṁchīni (||ramaṇi||) tŏlam̐gidinaṁṭā tūm̐gumaṁchamumīm̐ da sĕlavinavvuladoḍa śhirasūm̐sīni alasidinaṁṭā nalarum̐bānubum̐ mīda pulagalamenidom̐ bŏralĕḍini (||ramaṇi||) sŏrigidinaṁṭā suradabaravaśhāna- naraviri kanurĕppalallāḍiṁchīni tiramāyanaṁṭām̐ diruveṁkaḍeśhvarum̐ daruṇi galasi yiṁkām̐ damagiṁchīni