Title (Indic)రాయిడిఁ బెట్టక యింక రారే మీరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాయిడిఁ బెట్టక యింక రారే మీరు చాయకు వచ్చినప్పుడు సమ్మతించీఁగాని (॥రాయి॥) చేయిపట్టి తియ్యకురే చిత్తజుబాణాలచేత ఆయాలు దాఁకినప్పుడే అట్టేవచ్చీని నాయాలఁ బెట్టేవలపు నాకు నెందాఁకావచ్చీ కాయముపైఁ గలిగితేఁ గలిగీఁగాని (॥రాయి॥) పొంచి యాన వెట్టకురే పొంతనాలు గూడితేను మంచముపైఁ గూచుండి మరిగీఁగాని ఇంచుకంత రేఁచేనవ్వు యెక్కడి కెక్కఁగఁ బోయీ అంచుమోచినవేళల నయ్యీఁగాని (॥రాయి॥) సారెకు మొక్కకురే సరసమే చవులైతే కోరి వేఁడి తన్నుఁ దానే కూడీఁగాని యీరీతి శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గలసె నేరుపులు మీఁదమీఁద నెరపీఁ గాని English(||pallavi||) rāyiḍim̐ bĕṭṭaga yiṁka rāre mīru sāyagu vachchinappuḍu sammadiṁchīm̐gāni (||rāyi||) seyibaṭṭi tiyyagure sittajubāṇālaseda āyālu dām̐kinappuḍe aṭṭevachchīni nāyālam̐ bĕṭṭevalabu nāgu nĕṁdām̐kāvachchī kāyamubaim̐ galigidem̐ galigīm̐gāni (||rāyi||) pŏṁchi yāna vĕṭṭagure pŏṁtanālu gūḍidenu maṁchamubaim̐ gūsuṁḍi marigīm̐gāni iṁchugaṁta rem̐senavvu yĕkkaḍi kĕkkam̐gam̐ boyī aṁchumosinaveḽala nayyīm̐gāni (||rāyi||) sārĕgu mŏkkagure sarasame savulaide kori vem̐ḍi tannum̐ dāne kūḍīm̐gāni yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐ galasĕ nerubulu mīm̐damīm̐da nĕrabīm̐ gāni