Title (Indic)రాజసపువాని నింత రవ్వసేతురా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాజసపువాని నింత రవ్వసేతురా వోజతో గుట్టుసేసుక వుండవలెఁగాక (॥॥) కెలసి నీవిభుఁడు నీకే వలచునంటాను చెలులతోనెల్లాను చెప్పుకొనేవే తొలుత నతఁడు నీపొత్తున నారగించెనంటా చెలరేఁగి సంతోసానఁ జిమ్మిరేఁగేవే (॥॥) వొగ్గి యాతఁడప్పటి నీవొడివట్టి తీసెనంటా సిగ్గువిడిచాతనిపైఁ జేయివేతురా యెగ్గుపట్ట కెప్పుడూ నీయిచ్చలోనే వచ్చునంటా వెగ్గళించి సరసము వేమారు నాడుదురా (॥॥) యీతఁడు శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను నాతో నవ్వెనంటాను నీలుగనేలే ఆతుమగా నన్నునేలె ఆ నీకు నిచ్చెనంటా కాతరించి యిటువలెఁగాకు సేయనేలే English(||pallavi||) rājasabuvāni niṁta ravvasedurā vojado guṭṭusesuga vuṁḍavalĕm̐gāga (||||) kĕlasi nīvibhum̐ḍu nīge valasunaṁṭānu sĕluladonĕllānu sĕppugŏneve tŏluda nadam̐ḍu nībŏttuna nāragiṁchĕnaṁṭā sĕlarem̐gi saṁtosānam̐ jimmirem̐geve (||||) vŏggi yādam̐ḍappaḍi nīvŏḍivaṭṭi tīsĕnaṁṭā sigguviḍisādanibaim̐ jeyivedurā yĕggubaṭṭa kĕppuḍū nīyichchalone vachchunaṁṭā vĕggaḽiṁchi sarasamu vemāru nāḍudurā (||||) yīdam̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu nādo navvĕnaṁṭānu nīluganele ādumagā nannunelĕ ā nīgu nichchĕnaṁṭā kādariṁchi yiḍuvalĕm̐gāgu seyanele