Title (Indic)రాజసాలే తఱచాయ రావే నీవు । తన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాజసాలే తఱచాయ రావే నీవు । తన- వోజ యిట్టిదౌతెఱఁగవో యమ్మ తాను (॥రాజ॥) పతి నింత దూరకువే పదవే నీవు నేఁ దతి నింత వగవఁగఁ దగదే నాకు కతలాయ నాబదుకు కదవే నేఁడూ; తన యితవయినట్టు సేయినీ యెట్టియినాఁ దాను (॥రాజ॥) వెంటవెంటఁ దిరుగక విడవే నీవు యిందుఁ కంటిపట్టి మిమ్ము నేమి నననే నేను దంటతనము నాకెందో దాఁగెనే నేఁడు! తనఁ నంటు చెల్లితేఁ జాలు నగనీవే తాను (॥రాజ॥) మాట లింత కోపరాదు మానవే నీవు! యిట్టె వోటలేక వెరగుతో నుండే నేను నాటకా లిన్ని విడిచి నన్నుఁ గూడెను! వాదుఁ లేఁటికి శ్రీవేంకటేశుఁ డింతవాఁడా తాను English(||pallavi||) rājasāle taṟasāya rāve nīvu | tana- voja yiṭṭidaudĕṟam̐gavo yamma tānu (||rāja||) padi niṁta dūraguve padave nīvu nem̐ dadi niṁta vagavam̐gam̐ dagade nāgu kadalāya nābadugu kadave nem̐ḍū; tana yidavayinaṭṭu seyinī yĕṭṭiyinām̐ dānu (||rāja||) vĕṁṭavĕṁṭam̐ dirugaga viḍave nīvu yiṁdum̐ kaṁṭibaṭṭi mimmu nemi nanane nenu daṁṭadanamu nāgĕṁdo dām̐gĕne nem̐ḍu! tanam̐ naṁṭu sĕllidem̐ jālu naganīve tānu (||rāja||) māḍa liṁta kobarādu mānave nīvu! yiṭṭĕ voḍalega vĕragudo nuṁḍe nenu nāḍagā linni viḍisi nannum̐ gūḍĕnu! vādum̐ lem̐ṭigi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtavām̐ḍā tānu