Title (Indic)రాకురాకు మయ్యా మాతో రంతు లింతేలా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాకురాకు మయ్యా మాతో రంతు లింతేలా వాకు నిష్టూరాన నిన్ను వద్దన నేఁ జాలను (॥రాకు॥) తొలవయ్య కాలుదాఁకీ దోసాలు గట్టకా తొలుతేమి చేసితినో తొయ్యలినైతి చెలఁగి యిందఱూ నీకుఁ జేయెత్తి మ్రొక్కగా చిలుకు గోళ్ల నిన్నుఁ జెనక నేఁ జాలను (॥రాకు॥) ఏమిటికి నంటించేవు ఎంగిలి మామోవి బూమిలేని చదువుల పుట్ట నీనోరు వేమాఱు నిందఱు నీకు వినుతించి మ్రొక్కంగ ప్రేమపునో ర నిన్ను పేరఁ దిట్టఁజాలను (॥రాకు॥) యేల కిందుపడి మొక్కే వేమి బాఁతినే నీకు కూళ నింతేని కాలిగోరఁ బోలను మేలిమి శ్రీ వేంకటేశ మెఱసి మాచనవు మేలములాడుచు నిన్ను మెప్పించ నేఁ జాలను English(||pallavi||) rāgurāgu mayyā mādo raṁtu liṁtelā vāgu niṣhṭūrāna ninnu vaddana nem̐ jālanu (||rāgu||) tŏlavayya kāludām̐kī dosālu gaṭṭagā tŏludemi sesidino tŏyyalinaidi sĕlam̐gi yiṁdaṟū nīgum̐ jeyĕtti mrŏkkagā silugu goḽla ninnum̐ jĕnaga nem̐ jālanu (||rāgu||) emiḍigi naṁṭiṁchevu ĕṁgili māmovi būmileni saduvula puṭṭa nīnoru vemāṟu niṁdaṟu nīgu vinudiṁchi mrŏkkaṁga premabuno ra ninnu peram̐ diṭṭam̐jālanu (||rāgu||) yela kiṁdubaḍi mŏkke vemi bām̐tine nīgu kūḽa niṁteni kāligoram̐ bolanu melimi śhrī veṁkaḍeśha mĕṟasi māsanavu melamulāḍusu ninnu mĕppiṁcha nem̐ jālanu