Title (Indic)రాకుంటే మానుఁగాక రంతులేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాకుంటే మానుఁగాక రంతులేఁటికే వేఁకపు గుబ్బలాండ్ల విటుడాఁతఁడు (॥రాకుం॥) అంపిన కప్పురమొల్ల నంటేఁ దాననుఁ గాక వంపు మోముతోడ నీకు వాడనేఁటికే చెంపల లప్పలు నిండఁ జెరిగిన కప్పురపు - గంపకొప్పుల సతుల ఘనుఁడాతడు (॥రాకుం॥) ఒద్దికగాకక్కడనే వుంటే దానుండుఁ గాక ముద్దుమోము వంచి నీకు మొక్కనేఁటికే చద్దికి వేఁడికి మంచిచక్క సతుల మోవి పొద్దునొద్దుకారగించే భోగి యాతఁడు (॥రాకుం॥) అబ్బురపు వేంకటేశుఁడైతే దానవుఁ గాక గబ్బి చూపులెల్లా నీకై గప్పనేఁటికే జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను గుబ్బలంటి సరసానఁ గూడెనాతఁడు English(||pallavi||) rāguṁṭe mānum̐gāga raṁtulem̐ṭige vem̐kabu gubbalāṁḍla viḍuḍām̐tam̐ḍu (||rāguṁ||) aṁpina kappuramŏlla naṁṭem̐ dānanum̐ gāga vaṁpu momudoḍa nīgu vāḍanem̐ṭige sĕṁpala lappalu niṁḍam̐ jĕrigina kappurabu - gaṁpagŏppula sadula ghanum̐ḍādaḍu (||rāguṁ||) ŏddigagāgakkaḍane vuṁṭe dānuṁḍum̐ gāga muddumomu vaṁchi nīgu mŏkkanem̐ṭige saddigi vem̐ḍigi maṁchisakka sadula movi pŏddunŏddugāragiṁche bhogi yādam̐ḍu (||rāguṁ||) abburabu veṁkaḍeśhum̐ḍaide dānavum̐ gāga gabbi sūbulĕllā nīgai gappanem̐ṭige jŏbbileḍi javvādisonala pannīḍa nannu gubbalaṁṭi sarasānam̐ gūḍĕnādam̐ḍu