Title (Indic)రాకుంటే దోసము సుమ్మీ రమణివొద్దికి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాకుంటే దోసము సుమ్మీ రమణివొద్దికి నీవు జోకగా నేరీతి నాపెఁ జొక్కులఁ బెట్టితివో (॥రాకు॥) సంతోసాన నున్న దిదె సారెఁ జిరునవ్వులతో మంతనాన నేమంటివో మగువతోను వింతవింతసింగారాల విఱ్ఱవీఁగీ నింటితోన అంతరంగమున కెన్ని ఆసలు వెట్టితివో (॥రాకు॥) గుత్తపుఁజెమటలే కుమ్మరించీని సతి చిత్తగించి యెట్లాఁ జూచితివో నీవు బొత్తుగాఁ బాన్పుపై నీపొందులే కోరుకున్నది ఇత్తల నమ్మిక లెన్ని ఇచ్చితివో నీవు (॥రాకు॥) ఆముకొని తమకించి అట్టె నీకాఁగిటఁ గూడీ యేమిసన్నసేసితివో యీఇంతికి యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితివి నేమముతో నెంతేసి నేరుచుకొంటివో English(||pallavi||) rāguṁṭe dosamu summī ramaṇivŏddigi nīvu jogagā nerīdi nābĕm̐ jŏkkulam̐ bĕṭṭidivo (||rāgu||) saṁtosāna nunna didĕ sārĕm̐ jirunavvulado maṁtanāna nemaṁṭivo maguvadonu viṁtaviṁtasiṁgārāla viṭravīm̐gī niṁṭidona aṁtaraṁgamuna kĕnni āsalu vĕṭṭidivo (||rāgu||) guttabum̐jĕmaḍale kummariṁchīni sadi sittagiṁchi yĕṭlām̐ jūsidivo nīvu bŏttugām̐ bānpubai nībŏṁdule korugunnadi ittala nammiga lĕnni ichchidivo nīvu (||rāgu||) āmugŏni tamagiṁchi aṭṭĕ nīgām̐giḍam̐ gūḍī yemisannasesidivo yīiṁtigi yīmerane śhrīveṁkaḍeśha nannu nelidivi nemamudo nĕṁtesi nerusugŏṁṭivo