Title (Indic)రాకు రాకు నీ వంత రవ్వసేయను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాకు రాకు నీ వంత రవ్వసేయను చేకొని పంతముల నాచేతిగోర నున్నవి (॥రాకు॥) చలము సాదించఁగానె సరసములాడైన నలయించకేలమానే నాసుద్దికి నిలువున వినయాలు నీవెంత సేసినాను కులికి నా కోపము గుండెలోనే వున్నది (॥రాకు॥) గుఱిగా నలుగఁగాని గుంపెనమొక్కులనైన యెఱిఁగించే నీగుణాలు యీ నీ చేఁతకు తఱితోడ నీవెంత దయవుట్టఁ బెనఁగినా మఱియును బీరాలు మా పెదవి నున్నవి (॥రాకు॥) కొసరి నే దిట్టఁగాని కూడినకూటమినైన పసచూపే నీ మోహపు పంతములకు యెసగి శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గలసితి వసదు నీ వలపు నా ఆతుమలో నున్నది English(||pallavi||) rāgu rāgu nī vaṁta ravvaseyanu segŏni paṁtamula nāsedigora nunnavi (||rāgu||) salamu sādiṁcham̐gānĕ sarasamulāḍaina nalayiṁchagelamāne nāsuddigi niluvuna vinayālu nīvĕṁta sesinānu kuligi nā kobamu guṁḍĕlone vunnadi (||rāgu||) guṟigā nalugam̐gāni guṁpĕnamŏkkulanaina yĕṟim̐giṁche nīguṇālu yī nī sem̐tagu taṟidoḍa nīvĕṁta dayavuṭṭam̐ bĕnam̐ginā maṟiyunu bīrālu mā pĕdavi nunnavi (||rāgu||) kŏsari ne diṭṭam̐gāni kūḍinagūḍaminaina pasasūbe nī mohabu paṁtamulagu yĕsagi śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ galasidi vasadu nī valabu nā ādumalo nunnadi