Title (Indic)రాగఁదే చూతఁడిదె రసికుఁడగు కెలవాడి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాగఁదే చూతఁడిదె రసికుఁడగు కెలవాడి- కౌఁగిటి రమణితోడ కనకగిరి వాని (॥రాగ॥) అదిగదె వసంతంబులాడీఁ గూడి కదలుఁగనుఁ గవల చక్కని సతులతో వెదకి పై కుంకుములు వేసీ రాసి వుదుటుచనుదోయిపై నొదిగి వొదిగి (॥రాగ॥) కడుఁ బేర్చి నేతికడవల గుబ్బెతలఁ జేరి అడుగడుగునకు నాటలాడి నడిమి సన్నపుసిరుల నగవు రెప్పల గరుల తొడికి చెనకీనదివొ దొరదైవము (॥రాగ॥) దప్పి దేరంగ సైఁదపుగుడుములును వడలుఁ బప్పులునుఁ బన్నీటి పానకములు అప్పఁడగు కెలవాడి అదె కనకరాయఁడై కప్పురము చల్లి చక్కని సతులపైని English(||pallavi||) rāgam̐de sūdam̐ḍidĕ rasigum̐ḍagu kĕlavāḍi- kaum̐giḍi ramaṇidoḍa kanagagiri vāni (||rāga||) adigadĕ vasaṁtaṁbulāḍīm̐ gūḍi kadalum̐ganum̐ gavala sakkani sadulado vĕdagi pai kuṁkumulu vesī rāsi vuduḍusanudoyibai nŏdigi vŏdigi (||rāga||) kaḍum̐ bersi nedigaḍavala gubbĕdalam̐ jeri aḍugaḍugunagu nāḍalāḍi naḍimi sannabusirula nagavu rĕppala garula tŏḍigi sĕnagīnadivŏ dŏradaivamu (||rāga||) dappi deraṁga saim̐dabuguḍumulunu vaḍalum̐ bappulunum̐ bannīḍi pānagamulu appam̐ḍagu kĕlavāḍi adĕ kanagarāyam̐ḍai kappuramu salli sakkani sadulabaini