Title (Indic)రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో రీతిగాదు హరి నెచ్చరికె సేయరే (॥రాతి॥) పైపై బొద్దువొడచి పంకజములు విరిసె గోప గోవిందుని మేలుకొన మనరే దీపములు దెల్లఁబారె తిమిరమింతయు జారె శ్రీపురుషోత్తమునిఁ జేయంటి లెమ్మనరే (॥రాతి॥) కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ నెలఁతలు దేవదేవు నిద్ర దెల్పరే జలనిధి పొంగణగె చాయలచుక్కలు మాసె వలరాచగురు నుప్పవడము గమ్మనరే (॥రాతి॥) జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు భావించి యచ్యుతునిట్టె పలికించరే కావిరింతయు విరిసె కడు సంధ్యకు బొద్దాయ శ్రీవేంకటేశుని విచ్చేయ మనరే English(||pallavi||) rādirĕlla sadulado radula nalasĕnemo rīdigādu hari nĕchcharigĕ seyare (||rādi||) paibai bŏdduvŏḍasi paṁkajamulu virisĕ goba goviṁduni melugŏna manare dībamulu dĕllam̐bārĕ timiramiṁtayu jārĕ śhrīburuṣhottamunim̐ jeyaṁṭi lĕmmanare (||rādi||) kaluvalu muguḽiṁchī kalaviṁka lĕlugiṁchī nĕlam̐talu devadevu nidra dĕlbare jalanidhi pŏṁgaṇagĕ sāyalasukkalu māsĕ valarāsaguru nuppavaḍamu gammanare (||rādi||) jīvulu melugŏniri sĕṁgaliṁchĕ daruvulu bhāviṁchi yachyuduniṭṭĕ paligiṁchare kāviriṁtayu virisĕ kaḍu saṁdhyagu bŏddāya śhrīveṁkaḍeśhuni vichcheya manare