Title (Indic)ప్రియములే చెప్పి పతిఁ బిలుచుక రాఁగదరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ప్రియములే చెప్పి పతిఁ బిలుచుక రాఁగదరే క్రియ యెరఁగక మరి కెరలించ నేఁటికే (॥ప్రియ॥) వాడికగా నందరిపై వలపులు చుల్లుఁగాక వేడుక కాని కెంతైనా వేసట గద్దా జాడతో మోవితేనెల చవి మరిగినవాఁడు అడికకు వెరచీనా అదలించ నేఁటికే (॥ప్రియ॥) పోసరించి కెళవుల పొందులే వెదకుఁ గాక ఆ సోదకాని కెంతైన నలపు గద్దా రాసికెక్క గాంతులతొ రచ్చలు సేసెటివాఁడు దోసానకు లోగినా దూర నిఁక నేఁటికే రాతిరి బగలు నిట్టే రతుల నోలాడుఁగాక యేతరి కాని కెంతైనా నెంగిలి గద్దా యీతల శ్రీవేంకటేశుఁ డిదె నన్ను నేలినాఁడు నీతి యిఁకఁ దప్పీనా నేర మెంచ నేఁటికే English(||pallavi||) priyamule sĕppi padim̐ bilusuga rām̐gadare kriya yĕram̐gaga mari kĕraliṁcha nem̐ṭige (||priya||) vāḍigagā naṁdaribai valabulu sullum̐gāga veḍuga kāni kĕṁtainā vesaḍa gaddā jāḍado movidenĕla savi mariginavām̐ḍu aḍigagu vĕrasīnā adaliṁcha nem̐ṭige (||priya||) posariṁchi kĕḽavula pŏṁdule vĕdagum̐ gāga ā sodagāni kĕṁtaina nalabu gaddā rāsigĕkka gāṁtuladŏ rachchalu sesĕḍivām̐ḍu dosānagu loginā dūra nim̐ka nem̐ṭige rādiri bagalu niṭṭe radula nolāḍum̐gāga yedari kāni kĕṁtainā nĕṁgili gaddā yīdala śhrīveṁkaḍeśhum̐ ḍidĕ nannu nelinām̐ḍu nīdi yim̐kam̐ dappīnā nera mĕṁcha nem̐ṭige