Title (Indic)పొందైన యింతులు లేరో పురుషులు లేరో భూమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పొందైన యింతులు లేరో పురుషులు లేరో భూమి ఇందే కంటిమి వింత లివి గొన్ని వలెనా (॥పొందై॥) వేడుకా నొకకొంత విసువూ నొకకొంత ఆడనుండే పతి మాటలాడించఁగా తోడ నలయించుకంటె తొల్లిటి అలుకే మేలు వాడికె నీసతి కింతవలెనా అగడు (॥పొందై॥) సెలవిన వ్వొకకొంత చిక్కుచేయీ నొకకొంత సొలసి ముందర నిల్చి జోలిదవ్వఁగా నిలుచుండి యేఁచుకంటె నీవు రానన్నా మేలు వలచినచెలి కింతవలెనా తగవు (॥పొందై॥) నిండుఁగల లొకకొంత నిట్టూర్పు నొకకొంత అండ నీవు కాఁగిలించి అటు గూడఁగా కొండల శ్రీవేంకటేశ కోమలిపై నీమేలు వండు గేరెఁ జెలి కింకవలెనా వెరగు English(||pallavi||) pŏṁdaina yiṁtulu lero puruṣhulu lero bhūmi iṁde kaṁṭimi viṁta livi gŏnni valĕnā (||pŏṁdai||) veḍugā nŏgagŏṁta visuvū nŏgagŏṁta āḍanuṁḍe padi māḍalāḍiṁcham̐gā toḍa nalayiṁchugaṁṭĕ tŏlliḍi aluge melu vāḍigĕ nīsadi kiṁtavalĕnā agaḍu (||pŏṁdai||) sĕlavina vvŏgagŏṁta sikkuseyī nŏgagŏṁta sŏlasi muṁdara nilsi jolidavvam̐gā nilusuṁḍi yem̐sugaṁṭĕ nīvu rānannā melu valasinasĕli kiṁtavalĕnā tagavu (||pŏṁdai||) niṁḍum̐gala lŏgagŏṁta niṭṭūrbu nŏgagŏṁta aṁḍa nīvu kām̐giliṁchi aḍu gūḍam̐gā kŏṁḍala śhrīveṁkaḍeśha komalibai nīmelu vaṁḍu gerĕm̐ jĕli kiṁkavalĕnā vĕragu