Title (Indic)పొద్దు వోనివాఁడుగాక పొలఁతులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పొద్దు వోనివాఁడుగాక పొలఁతులాల ఇద్దరిలోన నేఁ దన కిరవౌ తెఱఁగఁడా (॥పొద్దు॥) నిన్నామొన్నా నెందుండెనో నేఁడు మాఇంటికి వచ్చె యెన్నాళ్ల కెన్నాళ్లపొందు ఒదేమే తాను యెన్నిక నెవ్వతెనో నాయీడు సేయఁ జూచీని పున్నమానమాసా నొక పోలికై నుండునటే (॥పొద్దు॥) వొప్పి రేపే బాస ఇచ్చె నూరకె మధ్యాహ్నమెక్కె యెప్పటి కెప్పటిమాఁట ఇదేమే తాను చొప్పలెత్తి యాపె సుద్దులే యప్పటిఁ జెప్పీ కప్పరములో నుప్ప గలపఁగ నేఁటికే (॥పొద్దు॥) యేచి నాపై సేస చల్లె ఇంతలోనె కాఁగిలించీ యేచేఁత కేచేఁత ఇదేమే తాను యీ చాయ శ్రీవేంకటేశుఁ డింతిచే నాకు మొక్కించీ పూచిన పూవునఁ బిందె బొడమించుఁ గదవే English(||pallavi||) pŏddu vonivām̐ḍugāga pŏlam̐tulāla iddarilona nem̐ dana kiravau tĕṟam̐gam̐ḍā (||pŏddu||) ninnāmŏnnā nĕṁduṁḍĕno nem̐ḍu māiṁṭigi vachchĕ yĕnnāḽla kĕnnāḽlabŏṁdu ŏdeme tānu yĕnniga nĕvvadĕno nāyīḍu seyam̐ jūsīni punnamānamāsā nŏga poligai nuṁḍunaḍe (||pŏddu||) vŏppi rebe bāsa ichchĕ nūragĕ madhyāhnamĕkkĕ yĕppaḍi kĕppaḍimām̐ṭa ideme tānu sŏppalĕtti yābĕ suddule yappaḍim̐ jĕppī kapparamulo nuppa galabam̐ga nem̐ṭige (||pŏddu||) yesi nābai sesa sallĕ iṁtalonĕ kām̐giliṁchī yesem̐ta kesem̐ta ideme tānu yī sāya śhrīveṁkaḍeśhum̐ ḍiṁtise nāgu mŏkkiṁchī pūsina pūvunam̐ biṁdĕ bŏḍamiṁchum̐ gadave