Title (Indic)పొద్దొక వింతలు యీ పొలఁతి బిన్నాణాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పొద్దొక వింతలు యీ పొలఁతి బిన్నాణాలు సుద్దు లేమని చెప్పేము చూడరమ్మ చెలులు (॥పొద్దొ॥) వేసినది వల్లవాటు వెలఁది పయ్యదకొంగు వూసినది కస్తూరి బుజాలదాఁక మూసినది చెక్కు చేఁత ముసిముసి నవ్వులతో యీసతి వొయ్యారాలు యేమని చెప్పదమే (॥పొద్దొ॥) కట్టినది చెంగావి కడు నెరులు విరిచి పట్టినది సేవంతి బంతి చేఁతలు పెట్టినది విరులతో పెనచుక పెనుఁగొప్పు ఇట్టి యీకె సింగారాలు యేమని చెప్పదమే (॥పొద్దొ॥) మించినది మేనునిండా నిచ్చళపు సొమ్ములు పెంచినది కుచములు పెద్దలుగాను అంచల శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్ను నేలె యెంచి యీకె మురిపెము లేమని చెప్పదమే English(||pallavi||) pŏddŏga viṁtalu yī pŏlam̐ti binnāṇālu suddu lemani sĕppemu sūḍaramma sĕlulu (||pŏddŏ||) vesinadi vallavāḍu vĕlam̐di payyadagŏṁgu vūsinadi kastūri bujāladām̐ka mūsinadi sĕkku sem̐ta musimusi navvulado yīsadi vŏyyārālu yemani sĕppadame (||pŏddŏ||) kaṭṭinadi sĕṁgāvi kaḍu nĕrulu virisi paṭṭinadi sevaṁti baṁti sem̐talu pĕṭṭinadi virulado pĕnasuga pĕnum̐gŏppu iṭṭi yīgĕ siṁgārālu yemani sĕppadame (||pŏddŏ||) miṁchinadi menuniṁḍā nichchaḽabu sŏmmulu pĕṁchinadi kusamulu pĕddalugānu aṁchala śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannu nelĕ yĕṁchi yīgĕ muribĕmu lemani sĕppadame