Title (Indic)పిలుపించుకొవలెనా పెనఁగి సారెసారెకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పిలుపించుకొవలెనా పెనఁగి సారెసారెకు తలవంచుకొననేల తగులాయ ననవే (॥పలు॥) వసంతకాలము వచ్చె వలపులు కడుహెచ్చె వెసఁ దుమ్మిదలెల్లాను విచ్చెరెక్కలు కొసరించుకొననేల గొరగీరితే నేరౌను రసికుఁడు తానెఱుఁగు రమ్మనవే యిఁకను (॥పలు॥) పున్నమవెన్నెల గాసెఁ బొందుగాఁ గోవిల గూసె చన్నులతో హారములు సాముచేసెను చిన్నఁబోనేల నవ్వులు చెట్టడువఁ జేటఁడవును విన్నపములు సేయరే విభునికిఁ దెలిపి (॥పలు॥) చిలుకలు రవళించె చిత్తజుఁడు గిలిగించె చెలరేఁగి జవ్వనము చిగిరించెను అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు కలసె నన్నుఁ దొల్లె కడమ లేదిఁకను English(||pallavi||) pilubiṁchugŏvalĕnā pĕnam̐gi sārĕsārĕgu talavaṁchugŏnanela tagulāya nanave (||palu||) vasaṁtagālamu vachchĕ valabulu kaḍuhĕchchĕ vĕsam̐ dummidalĕllānu vichchĕrĕkkalu kŏsariṁchugŏnanela gŏragīride neraunu rasigum̐ḍu tānĕṟum̐gu rammanave yim̐kanu (||palu||) punnamavĕnnĕla gāsĕm̐ bŏṁdugām̐ govila gūsĕ sannulado hāramulu sāmusesĕnu sinnam̐bonela navvulu sĕṭṭaḍuvam̐ jeḍam̐ḍavunu vinnabamulu seyare vibhunigim̐ dĕlibi (||palu||) silugalu ravaḽiṁchĕ sittajum̐ḍu giligiṁchĕ sĕlarem̐gi javvanamu sigiriṁchĕnu alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu kalasĕ nannum̐ dŏllĕ kaḍama ledim̐kanu