Title (Indic)పట్టినదే చలము యీ పడఁతి యిదే నోఁచెనో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పట్టినదే చలము యీ పడఁతి యిదే నోఁచెనో వొట్టి చెలుల మేమన్నా వూఁకొన దో రమణి (॥పట్టి॥) చెక్కుచేయి యీ సతి చింతకే కాచుకుండెనో తెక్కుల నెంత దీమన్నాఁ దియ్య దిది చిక్ననిమోము నవ్వులు సిగ్గుకే కాచుకుండెనో యెక్కువఁ దలెత్తుమంటె నెత్తదు యీ చెలియ (॥పట్టి॥) రమణివిరహము వెఱగుకే కాచుకుండెనో తెమలి యెంత దెల్పినాఁ దెలియదు చిముడువలపు లింతిచెమటకే కాచుకుండెనో తమ నెంత విసరినా తనువున నింకవు (॥పట్టి॥) వెలఁదివూర్పులు రతివేళకే కాచుకుండెనో వలదని మానిపినా వసముగాదు యెలమి శ్రీవేంకటేశుఁ డింత సేసి కాంతఁ గూడె తలఁపు లిద్దరికిని తమకించెనో English(||pallavi||) paṭṭinade salamu yī paḍam̐ti yide nom̐sĕno vŏṭṭi sĕlula memannā vūm̐kŏna do ramaṇi (||paṭṭi||) sĕkkuseyi yī sadi siṁtage kāsuguṁḍĕno tĕkkula nĕṁta dīmannām̐ diyya didi siknanimomu navvulu sigguge kāsuguṁḍĕno yĕkkuvam̐ dalĕttumaṁṭĕ nĕttadu yī sĕliya (||paṭṭi||) ramaṇivirahamu vĕṟaguge kāsuguṁḍĕno tĕmali yĕṁta dĕlbinām̐ dĕliyadu simuḍuvalabu liṁtisĕmaḍage kāsuguṁḍĕno tama nĕṁta visarinā tanuvuna niṁkavu (||paṭṭi||) vĕlam̐divūrbulu radiveḽage kāsuguṁḍĕno valadani mānibinā vasamugādu yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi kāṁtam̐ gūḍĕ talam̐pu liddarigini tamagiṁchĕno