Title (Indic)పైపై నిన్నుఁ గొరితే పసురే కాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పైపై నిన్నుఁ గొరితే పసురే కాదా వైపులు సేసుక నే నే వద్దనుండేఁ గాకా (॥పప॥) యిచ్చకము లాడఁగానె యిటు రమ్మనేవు గాక చెచ్చెర నిజ మాడితే చేర నిచ్చేవా పచ్చిగాఁగ నీగుణము పచరించ నేమున్నది కొచ్చి నా నేరుపుననె గుట్టుసేసేఁ గాకా (॥పప॥) చాయచేసు కుండఁగానె చవులై వుందానఁగాక నాయము నడపు మంటే నన్ను మెచ్చేవా సోయగాన నిన్నంత సోదించ నేమున్నది తీయని మాటాడి నిన్ను తిద్దుకొనేఁ గాక (॥పప॥) కదిసి నేఁ గూడఁగానె కరఁగి చొక్కేవు గాక వదరి నే నూరకున్న వస మయ్యేవా అదె శ్రీ వెంకటేశుఁడ అలమేలుమంగ నేను పొదిగి నేనుండఁగానె భోగించేవు గాకా English(||pallavi||) paibai ninnum̐ gŏride pasure kādā vaibulu sesuga ne ne vaddanuṁḍem̐ gāgā (||paba||) yichchagamu lāḍam̐gānĕ yiḍu rammanevu gāga sĕchchĕra nija māḍide sera nichchevā pachchigām̐ga nīguṇamu pasariṁcha nemunnadi kŏchchi nā nerubunanĕ guṭṭusesem̐ gāgā (||paba||) sāyasesu kuṁḍam̐gānĕ savulai vuṁdānam̐gāga nāyamu naḍabu maṁṭe nannu mĕchchevā soyagāna ninnaṁta sodiṁcha nemunnadi tīyani māḍāḍi ninnu tiddugŏnem̐ gāga (||paba||) kadisi nem̐ gūḍam̐gānĕ karam̐gi sŏkkevu gāga vadari ne nūragunna vasa mayyevā adĕ śhrī vĕṁkaḍeśhum̐ḍa alamelumaṁga nenu pŏdigi nenuṁḍam̐gānĕ bhogiṁchevu gāgā