Title (Indic)పతిముందర నెంతేసి పగటులు చూపీనే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పతిముందర నెంతేసి పగటులు చూపీనే కతకారి చేఁతలనే కడుఁ బరగినది (॥పతి॥) మాటలఁ దేనెలు గారీ మగువ నేరుపులను తేటల వెన్నెలగాసీ తెలిఁగన్నుల కోటిసేయఁ గొప్పువెట్టి కొనలు వేళ్ళఁ దురిమె యాటులేదు దీనియెమ్మె లేమని చెప్పుదమే (॥పతి॥) నప్పుల ముత్యాలు రాలీ నలినాక్షి చేఁతలను జవ్వనపుఁబోడి చిందీ చన్నుఁగవను పువ్వువంటి చీర గట్టి పొందుగా సొమ్ములు వెట్టె ఇవ్వల నీకె సింగారా లేమని చెప్పుదమే (॥పతి॥) సన్నల మచ్చికలూరీ సతిసేయు నేస్తముల వన్నెల కళలు దేరీ వదనమున యిన్నిటాను తొల్లె నన్ను నేలె శ్రీవేంకటేశుఁడు యెన్నరా దీవెయాసోదా లేమని చెప్పుదమే English(||pallavi||) padimuṁdara nĕṁtesi pagaḍulu sūbīne kadagāri sem̐talane kaḍum̐ baraginadi (||padi||) māḍalam̐ denĕlu gārī maguva nerubulanu teḍala vĕnnĕlagāsī tĕlim̐gannula koḍiseyam̐ gŏppuvĕṭṭi kŏnalu veḽḽam̐ durimĕ yāḍuledu dīniyĕmmĕ lemani sĕppudame (||padi||) nappula mutyālu rālī nalinākṣhi sem̐talanu javvanabum̐boḍi siṁdī sannum̐gavanu puvvuvaṁṭi sīra gaṭṭi pŏṁdugā sŏmmulu vĕṭṭĕ ivvala nīgĕ siṁgārā lemani sĕppudame (||padi||) sannala machchigalūrī sadiseyu nestamula vannĕla kaḽalu derī vadanamuna yinniḍānu tŏllĕ nannu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu yĕnnarā dīvĕyāsodā lemani sĕppudame