Title (Indic)పదారువేలు(ల?) సతుల పతివి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పదారువేలు(ల?) సతుల పతివి నీవు సుదతి వెంగెమాడదు సుమ్మీ యీ పట్టుకు (॥పదా॥) మొక్కిమొక్కి చెలియ నీముందరనే వుండఁగాను తక్కక సిగ్గుతోనేల తలవంచేవు నిక్కి వెరొకతెవద్ద నీ వుండఁగాఁ గనెనో ఇక్కడ నీ వందుకుఁగా నేఁటికి లోగేవు (॥పదా॥) వేడుకతో నాపె నిన్ను వేమారు నుతించంగాను యీడ ముసుఁగువెట్టుక యెంత నవ్వేవు పాడితో నీ వెవ్వతెకు బాస లియ్యఁగా వినెనో తోడనే నీవప్పటి నిందులకేల కొంకేవు (॥పదా॥) నెమ్మది నలమేల్ మంగ నిన్నుఁ గాఁగిలించఁగాను అమ్మరో నీవెంతేసిప్రియాలు చెప్పేవు కమ్మి శ్రీవేంకటేశ నీకత లీపె దెలిసెనో సమ్మతించె నిందుకుఁగా చంద మెంతసేసేవు English(||pallavi||) padāruvelu(la?) sadula padivi nīvu sudadi vĕṁgĕmāḍadu summī yī paṭṭugu (||padā||) mŏkkimŏkki sĕliya nīmuṁdarane vuṁḍam̐gānu takkaga siggudonela talavaṁchevu nikki vĕrŏgadĕvadda nī vuṁḍam̐gām̐ ganĕno ikkaḍa nī vaṁdugum̐gā nem̐ṭigi logevu (||padā||) veḍugado nābĕ ninnu vemāru nudiṁchaṁgānu yīḍa musum̐guvĕṭṭuga yĕṁta navvevu pāḍido nī vĕvvadĕgu bāsa liyyam̐gā vinĕno toḍane nīvappaḍi niṁdulagela kŏṁkevu (||padā||) nĕmmadi nalamel maṁga ninnum̐ gām̐giliṁcham̐gānu ammaro nīvĕṁtesipriyālu sĕppevu kammi śhrīveṁkaḍeśha nīgada lībĕ dĕlisĕno sammadiṁchĕ niṁdugum̐gā saṁda mĕṁtasesevu