Title (Indic)పాకము దప్పినఁ బనికిరా విఁకను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాకము దప్పినఁ బనికిరా విఁకను దీకొని రమణుఁడ తెలుపఁగవలెనా (॥పాక॥) వుడికినచిత్తం బూఁకొననోపదు పడఁతులతోఁ జెప్పర మాఁట బడలినచేతులు పట్టఁగనోపవు అడపమునకు వీడె మందియ్యరాదా (॥పాక॥) వాడుమోము నవ్వఁగనోపదు నీ- వాడర సరసము లటువోయి వీడినతురు మది విరులకు నోపదు బోడమ్ముల మరుపొదుల నునచరా (॥పాక॥) కాఁగిన దేహము కప్పుడు కోపదు రాఁగుఁబచ్చడము రతి నిడరా కాఁగిట శ్రీవేంకటపతి కూడితిఁ వేఁగక యిచటనే యెనసి వుండరా English(||pallavi||) pāgamu dappinam̐ banigirā vim̐kanu dīgŏni ramaṇum̐ḍa tĕlubam̐gavalĕnā (||pāga||) vuḍiginasittaṁ būm̐kŏnanobadu paḍam̐tuladom̐ jĕppara mām̐ṭa baḍalinasedulu paṭṭam̐ganobavu aḍabamunagu vīḍĕ maṁdiyyarādā (||pāga||) vāḍumomu navvam̐ganobadu nī- vāḍara sarasamu laḍuvoyi vīḍinaduru madi virulagu nobadu boḍammula marubŏdula nunasarā (||pāga||) kām̐gina dehamu kappuḍu kobadu rām̐gum̐bachchaḍamu radi niḍarā kām̐giḍa śhrīveṁkaḍabadi kūḍidim̐ vem̐gaga yisaḍane yĕnasi vuṁḍarā