Title (Indic)పాటించి నమ్మినవారి భాగ్యము గాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాటించి నమ్మినవారి భాగ్యము గాదా కోటిసుద్దులేల యిదె కోరి చేకొనేది (॥పాటిం॥) స్వామిద్రోహియైన చండి రావణాసురుఁడు కామించి శరణంటేను కాచేనంటివి యేమని నీదయ యెంతు నెంతని నీమహిమెంతు ఆమాటకు సరియౌ నఖిలవేదములు (॥పాటిం॥) దావతి సీతాద్రోహము దలఁచి కాకాసురుఁడు కావుమని శరణంటేఁ గాచితివి ఆవల నీపని యెట్టు అట్టే నీమన్నన యెట్టు యీవల నీశరణనే ఇందుసరే తపము (॥పాటిం॥) చిక్కులిన్నీ నిఁకనేల చేరి యేపాటివాఁడైన గక్కన నీశరణంటేఁ గాతువు నీవు అక్కరతో నిన్ను శరణంటిమి శ్రీవేంకటేశ యెక్కువ నీ బిరుదుకు యీడా పుణ్యములు English(||pallavi||) pāḍiṁchi namminavāri bhāgyamu gādā koḍisuddulela yidĕ kori segŏnedi (||pāḍiṁ||) svāmidrohiyaina saṁḍi rāvaṇāsurum̐ḍu kāmiṁchi śharaṇaṁṭenu kāsenaṁṭivi yemani nīdaya yĕṁtu nĕṁtani nīmahimĕṁtu āmāḍagu sariyau nakhilavedamulu (||pāḍiṁ||) dāvadi sīdādrohamu dalam̐si kāgāsurum̐ḍu kāvumani śharaṇaṁṭem̐ gāsidivi āvala nībani yĕṭṭu aṭṭe nīmannana yĕṭṭu yīvala nīśharaṇane iṁdusare tabamu (||pāḍiṁ||) sikkulinnī nim̐kanela seri yebāḍivām̐ḍaina gakkana nīśharaṇaṁṭem̐ gāduvu nīvu akkarado ninnu śharaṇaṁṭimi śhrīveṁkaḍeśha yĕkkuva nī birudugu yīḍā puṇyamulu