Title (Indic)పాడేము నేము పరమాత్మ నిన్నును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాడేము నేము పరమాత్మ నిన్నును వేడుక ముప్పదిరెండువేళల రాగాలను (॥పాడే॥) తనువే వొళవు తలయే దండెకాయ ఘనమై వూర్పులు రెండు కట్టిన తాళ్ళు మనసే నీబద్దితాడు మరి గుణాలె జీవాళి మొనసిన పుట్టుగే మూలమైన కరడి (॥పాడే॥) పాపపుణ్యా లిరువంక పైఁడివెండియనుసులు పైపైఁ గుత్తికె మేటిపై చనిగె కోపుల నాలికెలోనఁ గుచ్చికట్టినట్టి తాడు చూపరాని సంసారమే సూత్రపు గణికె (॥పాడే॥) జీవునికిని దండె సేసినవాఁడవు నీవు వావాతి మాటలే నీపై వన్నెపదాలు యీవి మాకు నిహపరా లిచ్చితివి మెచ్చితివి శ్రీవేంకటేశ నీవే చేకొన్నదాతవు English(||pallavi||) pāḍemu nemu paramātma ninnunu veḍuga muppadirĕṁḍuveḽala rāgālanu (||pāḍe||) tanuve vŏḽavu talaye daṁḍĕgāya ghanamai vūrbulu rĕṁḍu kaṭṭina tāḽḽu manase nībaddidāḍu mari guṇālĕ jīvāḽi mŏnasina puṭṭuge mūlamaina karaḍi (||pāḍe||) pābabuṇyā liruvaṁka paim̐ḍivĕṁḍiyanusulu paibaim̐ guttigĕ meḍibai sanigĕ kobula nāligĕlonam̐ guchchigaṭṭinaṭṭi tāḍu sūbarāni saṁsārame sūtrabu gaṇigĕ (||pāḍe||) jīvunigini daṁḍĕ sesinavām̐ḍavu nīvu vāvādi māḍale nībai vannĕbadālu yīvi māgu nihabarā lichchidivi mĕchchidivi śhrīveṁkaḍeśha nīve segŏnnadādavu