Title (Indic)పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాడైన యెరుకతో బంధమోక్షము లొక్క- గాడిఁ గట్టుట తెలివి గానకే కాదా (॥పాడై॥) భావించి నినుఁ బరబ్రహ్మమని వేదములు వేవేలు విధుల మొరవెట్టఁగాను కేవలపు నిన్ను దక్కిన దైవములఁ గూర్చి సేవింపుటిది తప్పు సేయుటేకాదా (॥పాడై॥) సరిలేని నిను నుపనిషద్వాక్యములె పరా త్పరుఁడవని నలుగడలఁ బలుకఁగాను వరుసతోఁ బెక్కు దైవములు సంగడి నిన్ను తొరలఁ గొలుచుట మహా ద్రోహమేకాదా (॥పాడై॥) ఎందుఁ జూచిన పురాణేతిహాసములు నీ చందమే యధికమని చాటఁగాను చందర్ప జనక వేంకటగిరి స్వామి నీ కందు వెఱఁగనిది యజ్ఞానమేకాదా English(||pallavi||) pāḍaina yĕrugado baṁdhamokṣhamu lŏkka- gāḍim̐ gaṭṭuḍa tĕlivi gānage kādā (||pāḍai||) bhāviṁchi ninum̐ barabrahmamani vedamulu vevelu vidhula mŏravĕṭṭam̐gānu kevalabu ninnu dakkina daivamulam̐ gūrsi seviṁpuḍidi tappu seyuḍegādā (||pāḍai||) sarileni ninu nubaniṣhadvākyamulĕ parā tparum̐ḍavani nalugaḍalam̐ balugam̐gānu varusadom̐ bĕkku daivamulu saṁgaḍi ninnu tŏralam̐ gŏlusuḍa mahā drohamegādā (||pāḍai||) ĕṁdum̐ jūsina purāṇedihāsamulu nī saṁdame yadhigamani sāḍam̐gānu saṁdarba janaga veṁkaḍagiri svāmi nī kaṁdu vĕṟam̐ganidi yajñānamegādā