Title (Indic)పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాప మెఱఁగను పుణ్యఫల మెఱఁగను యే పనులు నీకు సెల విన్నియునుఁ గావా (॥పాప॥) మునుప నీవిషయముల ముద్ర మానుసులఁగా- నునిచితివి నామీఁద నొకటొకటినే అనిశంబు నవి చెప్పినట్లఁ జేయకయున్న ఘనుఁడ నీయాజ్ఞ నేఁ గడచుటే కాదా (॥పాప॥) కలిమిగల యింద్రియపుఁ గాఁపులుండిన వూరు యెలమి నా కొసఁగితివి యేలుమనుచు అలసి వీరల నేను నాదరించక కినిసి తొలఁగఁద్రోచిన నదియు ద్రోహమే కాదా (॥పాప॥) కుటలములఁ బెడఁబాపి కోరిన చనవులెల్ల ఘటనఁ జెల్లించితివి ఘనుఁడ నేను అటుగనక శ్రీవేంకటాద్రీశ నీదాసి- నెటుచేసినా నీకు నితవేకాదా English(||pallavi||) pāba mĕṟam̐ganu puṇyaphala mĕṟam̐ganu ye panulu nīgu sĕla vinniyunum̐ gāvā (||pāba||) munuba nīviṣhayamula mudra mānusulam̐gā- nunisidivi nāmīm̐da nŏgaḍŏgaḍine aniśhaṁbu navi sĕppinaṭlam̐ jeyagayunna ghanum̐ḍa nīyājña nem̐ gaḍasuḍe kādā (||pāba||) kalimigala yiṁdriyabum̐ gām̐puluṁḍina vūru yĕlami nā kŏsam̐gidivi yelumanusu alasi vīrala nenu nādariṁchaga kinisi tŏlam̐gam̐drosina nadiyu drohame kādā (||pāba||) kuḍalamulam̐ bĕḍam̐bābi korina sanavulĕlla ghaḍanam̐ jĕlliṁchidivi ghanum̐ḍa nenu aḍuganaga śhrīveṁkaḍādrīśha nīdāsi- nĕḍusesinā nīgu nidavegādā