Title (Indic)పాప మంటాఁ దనమీఁద బత్తి సేయఁ బోతేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాప మంటాఁ దనమీఁద బత్తి సేయఁ బోతేను కోపగించుకొన వచ్చీ కొమ్మలాల చూడరే (॥పాప మంటా॥) అయ్యో యేమే తనకు నే నంటే నెంత సదరమే కొయ్యగదే ముక్కుననే కోప మున్నది చయ్యన నెవ్వతెతోనో జగడ మడిచి వచ్చీ వొయ్యన నేనడిగితే నుడికిపడీని (॥పాప మంటా॥) చెల్ల బో నే నెంత దనచేతికల సత్తినే పల్లదము దననోరఁ బై పై నున్నది కెల్లు రేఁగి యాడనో తా గిజి గిజి యై వచ్చీ కల్లగదె చూడఁ బోతే గదరుకొనీని (॥పాప మంటా॥) మేలు మేలె తన కెంత మిక్కిలి యనాదనే కీలుకొని బొమ్మల జంకెన లున్నది వే ళెరిఁగి శ్రీవెంకటవిభుఁడిట్టె నన్నుఁ గూడె కేలు చాఁచి పెనఁగితే కేరుచు నవ్వీనే English(||pallavi||) pāba maṁṭām̐ danamīm̐da batti seyam̐ bodenu kobagiṁchugŏna vachchī kŏmmalāla sūḍare (||pāba maṁṭā||) ayyo yeme tanagu ne naṁṭe nĕṁta sadarame kŏyyagade mukkunane koba munnadi sayyana nĕvvadĕdono jagaḍa maḍisi vachchī vŏyyana nenaḍigide nuḍigibaḍīni (||pāba maṁṭā||) sĕlla bo ne nĕṁta danasedigala sattine palladamu dananoram̐ bai pai nunnadi kĕllu rem̐gi yāḍano tā giji giji yai vachchī kallagadĕ sūḍam̐ bode gadarugŏnīni (||pāba maṁṭā||) melu melĕ tana kĕṁta mikkili yanādane kīlugŏni bŏmmala jaṁkĕna lunnadi ve ḽĕrim̐gi śhrīvĕṁkaḍavibhum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ kelu sām̐si pĕnam̐gide kerusu navvīne