Title (Indic)ఓయమ్మ నీ గాతికి నోరుచునా యెవ్వతైనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఓయమ్మ నీ గాతికి నోరుచునా యెవ్వతైనా పాయలు వడినఁ బోదు పట్టకు మా చెఱఁగు (॥ఓయ॥) కాంతలఁ బెక్కులఁ బొంది కాయాటుపడె నీమేను యెంతవడైనా నలయ దిదివో నేఁడు ఇంతలోనే తమ్ములము లిందరివి లోఁగొని యెఁతైనాఁ గద్దు నీనోరు యెట్టు మాటాడేను (॥ఓయ॥) వనితల రహస్యాలు వాఁగి వాఁగి నీవీనులు వెనకతియ్య వెంతేసి విన్నవించినా తనివోనిమర్మములు తాఁకి తాఁకి గట్టిపడె పనివి నీచేతు లెట్టు పట్టిపెనఁగేను (॥ఓయ॥) కుచములు దాఁకి తాఁకి గురులాయ నీవురము రచన నన్నిటాను నీరచ్చకెక్కెను యిచట శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను పచరించి నీయాసలు పట్ట నెట్టు వచ్చును English(||pallavi||) oyamma nī gādigi norusunā yĕvvadainā pāyalu vaḍinam̐ bodu paṭṭagu mā sĕṟam̐gu (||oya||) kāṁtalam̐ bĕkkulam̐ bŏṁdi kāyāḍubaḍĕ nīmenu yĕṁtavaḍainā nalaya didivo nem̐ḍu iṁtalone tammulamu liṁdarivi lom̐gŏni yĕm̐tainām̐ gaddu nīnoru yĕṭṭu māḍāḍenu (||oya||) vanidala rahasyālu vām̐gi vām̐gi nīvīnulu vĕnagadiyya vĕṁtesi vinnaviṁchinā tanivonimarmamulu tām̐ki tām̐ki gaṭṭibaḍĕ panivi nīsedu lĕṭṭu paṭṭibĕnam̐genu (||oya||) kusamulu dām̐ki tām̐ki gurulāya nīvuramu rasana nanniḍānu nīrachchagĕkkĕnu yisaḍa śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu pasariṁchi nīyāsalu paṭṭa nĕṭṭu vachchunu