Title (Indic)ఊరివారిఁ జూచి చూచి వూరకే నోరూరనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఊరివారిఁ జూచి చూచి వూరకే నోరూరనేల ఆరీతి నీకెందుకైనా ఆసపడనేఁటికి (॥ఊరి॥) కన్నులెంత గనమైనాఁ గాంతకే చక్కఁదనము చన్నులెంత గనమైనా సాగు బలిమి యెన్నుకొంటా సారె సారె నేల యేఁకరేవు నీవు విన్ను నీవెంచుకోరాదా నీకేల యీగొడవ (॥ఊరి॥) నెఱి దురుమెఁతైనా నెలఁతకే సింగారము పిఱుఁ దెంతబటువైనా పెద్దఱికమే పఱచై పొగడ నీవు బట్టువాఁడవా యేమి గుఱుతువెట్టుకొనరాదా కొంచపడనేఁటికి (॥ఊరి॥) మొగమెంత మెఱుఁగైనా ముద్దుగాఁ జెలియకు నగవెంత గలిగినా నయమై తోఁచు వెగటుదీర శ్రీవేంకటేశ కూడితివి మగువనే మెచ్చరాదా మచ్చికలే నిండును English(||pallavi||) ūrivārim̐ jūsi sūsi vūrage norūranela ārīdi nīgĕṁdugainā āsabaḍanem̐ṭigi (||ūri||) kannulĕṁta ganamainām̐ gāṁtage sakkam̐danamu sannulĕṁta ganamainā sāgu balimi yĕnnugŏṁṭā sārĕ sārĕ nela yem̐karevu nīvu vinnu nīvĕṁchugorādā nīgela yīgŏḍava (||ūri||) nĕṟi durumĕm̐tainā nĕlam̐tage siṁgāramu piṟum̐ dĕṁtabaḍuvainā pĕddaṟigame paṟasai pŏgaḍa nīvu baṭṭuvām̐ḍavā yemi guṟuduvĕṭṭugŏnarādā kŏṁchabaḍanem̐ṭigi (||ūri||) mŏgamĕṁta mĕṟum̐gainā muddugām̐ jĕliyagu nagavĕṁta galiginā nayamai tom̐su vĕgaḍudīra śhrīveṁkaḍeśha kūḍidivi maguvane mĕchcharādā machchigale niṁḍunu